నిత్యజీవితంలో ఆధ్యాత్మికత
మనిషికి ఎన్ని ఇళ్ళు!
పుట్టిని ప్రతిమనిషికి రెండు ఇళ్ళు ఉంటాయి కట్టుకోకుండానే-పెరిగి పెద్ద అయిన తరువాత తాము కట్టుకునేది మూడో ఇల్లే-తమ లెక్కలో ఇది మొదటి సొంతఇల్లు అయినా కూడా! ఇది చాలామందికి తెలియని, అవగాహన లేని విషయం-పెక్కుమందికి ఈ ఆలోచనే రాదు కూడా!
బాల్యంలో పెరిగిన ఇంటి జ్ఞాపకాలు, మధుర స్మృతులు ఎన్నో ఎన్నెన్నో-అవన్నీ జీవితాంతం పదిలంగా ఉంటాయి- అంచేత అది సొంతఇల్లే కానవసరం లేదు ఇది రెండో ఇల్లు; మొదటి ఇల్లు లేకుండా రెండోఇల్లు ఎలా వచ్చిందని అనుకుంటున్నారా!
ప్రతి మనిషికి మొదటి ఇల్లు “తల్లి గర్భం” రెండవఇల్లు తాను పుట్టి బాల్యంలో పెరిగిన ఇల్లు; ఆ తర్వాత ఎన్ని ఇళ్ళు కొన్నా, కట్టుకున్నా, ఆకాశ హర్మ్యాలలో నివశిస్తున్నా మొదటి రెండు ఇళ్ళు ఏ మనిషీ మర్చిపోకూడదు; ఇవేవీ మన మొదటి ఇల్లుకు సాటిరావు-పోల్చతగినవే కావు- విలువకట్టలేనిది కూడా.
చాలామంది రెండవ ఇల్లుని గుర్తుపెట్టుకుంటారు,బాల్యస్మృతులతో పదేపదే గుర్తుతెచ్చుకుంటారుగానీ మొదటి ఇల్లుని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు!
ప్రతి తల్లీ తమ పిల్లల బరువును- బరువు అని అనుకోకుండా-నవమాసాలూ మోస్తూ ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది మనందరికీ.గర్భంలో ఉన్న మనవల్ల తాను ఎన్ని ఇబ్బందులూ, అసౌకర్యాలకు లోనయినా- మనం కాళ్లతో తన్నినా, చేతులతో కొట్టినా-అన్నింటిని తట్టుకుని తన కడుపులో పెట్టుకుని, పెంచుకుంటూ ఎప్పుడెప్పుడు మనల్ని చూస్తామో అన్న రీతిలో మురిపెంగా ప్రతి మాతృమూర్తి ఎదురుచూస్తూ ఉంటుంది.
మన ఆకలిని గ్రహించి, ఒక్కోసారి తనకి ఇబ్బందిగా ఉన్నాకూడా బలవంతంగా ఆహారాన్ని తీసుకుంటుంది-“కేవలం మనకోసం”-మనం ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి అడుగిడాలని!
ప్రేమ ఆప్యాయతలు ఉన్న ప్రతిమనిషి ఈ మొదటి ఇంటిని తమ ఆఖరిశ్వాసవరకు మర్చిపోకూడదు.కానీ ఈ కలుషిత ప్రపంచంలో వాళ్ళూ కలుషితమై కొంతమంది తమ ఉనికికే కారణమైన మొదటి ఇల్లునే మర్చిపోతుంటారు.ఈ విషయంలో వీళ్ళ తల్లితండ్రులు కాదు వీళ్ళే దురదృష్టవంతులు, దౌర్భాగ్యులూనూ-వీళ్ళు ఆ విషయం గ్రహించకపోయినా!
మొదటి ఇల్లు ఏదో ఇప్పుడన్నా తెలిసిందిగా తెలియనివాళ్ళకి- మర్చిపోకండేం!
దేవుణ్ణి కోరిక సరిగా అడగటం నేర్చుకోండి...
దేవుణ్ణి మనకు కావాల్సింది సరిగ్గా అడగకపోతే ఏం జరుగుతుందో అనునిత్యం మనం వివిధ మాధ్యమాల్లో జోకుల్లో, కార్టూన్స్ లో చూస్తూనే ఉన్నాం.ఆ జోక్స్ సంగతి ఎలాగ ఉన్నా దేవుణ్ణి సరిగ్గా కోరిక కోరడం మాత్రం జోక్ కాదు, చాలామందికి తమ కోరికని స్పష్టంగా ఎలా అడగాలో తెలియదు.
ఏదో మనసులో ఓ కోరిక పుట్టింది కదా అని బడాబడా నోరు తెరిచి అడిగేయడం కాదు- ఓ... క్షమించాలి- చాలామంది మనసులోనే కోరుకుంటారు కదా- పక్కవాళ్ళు విని వీళ్ళ కోరికని కాపీ కొట్టేస్తారని భయం కాబోలు.
ఆ... అంత చిత్రం (సీనేమీ) లేదు- అవతలవాళ్ళ దగ్గర కోరికల లిస్ట్ ఏవైనా తక్కువ ఉందా వీళ్ళదగ్గర కాపీ కొట్టడానికి.అసలు విషయం ఏమిటంటే పైకి దేవుడికి చెప్పుకుంటే-పూజారిగారు ఏమీ అనుకోరు-ఆయన తధాస్తు అంటారు. వచ్చిన తంటాఅల్లా- పక్కవాళ్ళు తమ కోరికల చిట్టా విని నవ్వుకుంటారేమో అని; అక్కడికేదో పక్కవాడేదో నిష్కామజీవితం జీవించేస్తున్నట్టు,అమాయకత్వం కాకపోతేనూ.
అసలు ఇంకో పని చెయ్యచ్చు- మనకున్న ఆప్తుల్లో ఒకళ్ళిద్దరిని వాళ్ళ మనసులో కోరికలు చెప్పమంటేసరి-వాళ్ళ లిస్ట్ లోవి మన లిస్ట్ లో వాటితో కొన్నిఅయినా మ్యాచ్ అవుతాయి కదా- అన్నీ కాకపోయినా- ఇలా ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి దేవుణ్ణి ఏం కోరిక కొరుకోవాలో కూడా తెలియదు. దీనివల్ల రెండు ప్రయోజనాలు- వాళ్ళ మనసులో కోరికలూ తెలుస్తాయి,మనకు కొత్త ఐడియాలు వస్తాయి- ఎలా ఉంది ఐడియా- ఆ మాత్రం లౌక్యం-బుర్రా లేకపొతే ఈ ప్రపంచంలో నెగ్గుకు రాగలమా!
ఇవేవి తెలుసుకోకుండా భగవంతుడి దగ్గరకి వెళ్లి మన పక్కవాడి కోరిక ఏదో తెలియకుండానే “డిట్టో” అన్నాం అనుకోండి- కొంపలు మునిగిపోవు- ఆ పక్క వెధవ ఏ విపరీతపు కోరికో, అఘాయిత్యపు కోరికో కోరివుంటే.ఈ ప్రపంచీకరణ,అంతర్జాలం దెబ్బల ప్రభావంతో “తధాస్తు దేవతలు” ఈ మధ్య ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు- కొంతమంది పూజారులతో బాటు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది-ఒళ్ళు కాదు-నోరూ -నోట్లో నాలుకానూ!
ఇక్కడే కాదు- ఎక్కడా డిట్టో అని మాత్రం అనబోకండి!
అసలు సగటు మనిషి అంటేనే వానపాముల పుట్ట,కోరికల పుట్ట,కోరికల చిట్టా ఉన్నవాడు-చిత్రగుప్తుడు చిట్టా కంటే ఎక్కువ కాకపోయినా దాదాపుగా దానికి సమానంగా ఉంటాయి కోరికలు ప్రతీ మనిషికి-పైకి కనపడరుగానీ.అసలు కోరికలు అనేవి ఏటిగట్టున ఉండే నీటి చెలమల్లాంటివి- ఎండిపోవడం అనేది ఉండదు- తవ్విన కొద్దీ ఇసుక, తీసిన కొద్దీ నీరూ ఊరుతూనే ఉంటాయి.
అసలు నాకు తెలియక అడుగుతున్నా దేవుణ్ణి కోరికలు కోరడం తప్పేమిటి-ఎందుకో చాలామంది ఆక్షేపిస్తారు గానీ- మనం నామోషీగా ఏం అనుకోనక్కర్లేదు-నిక్షేపంగా అడగొచ్చు మన ఇష్టమైనవి; ఏం- “అడగందే అమ్మయినా పెట్టదు అంటారుగా” - అమ్మే పెట్టనప్పుడు- దేవుడు మాత్రం అడగకుండానే ఇస్తాడా ఏంటి.దాదాపుగా ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు ఉన్నప్రపంచ జనాభాలో-మీరు ఇది చదివే సమయానికి ఎనిమిది వందల కోట్లు కూడా దాటి ఉంటుంది- అలాంటిది మనిషి మనిషిని అడిగి మరీ పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది ఆయనకి.
నా వరకు నేను మాత్రం కోరికల లిస్ట్ లాప్ టాప్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటా- మళ్ళీ మర్చిపోకుండా.ఇంకొంచెం తెలివిగా-ముందు జాగ్రత్త అనుకోండి- దీనికి పెద్ద మేధావితనం అక్కర్లేదు.పడుకునేటప్పుడు, మంచం పక్కన ఓ కలం- కాగితం మాత్రం పెట్టుకోవడం మరచిపోను- మంచి నీళ్లు పెట్టుకోవడం మర్చిపోయినా.
దాహంవేస్తే నిద్రలోంచి లేచల్లా మంచినీళ్లు తాగుతాం- మర్చిపొమ్ కదా-కోరికలు అలా కాదుకదా-హఠాత్తుగా నిద్రలో గుర్తుకొస్తే మర్చిపోకముందే రాసుకోవచ్చు!
ఇంకో ముఖ్య మైన విషయం కూడానూ- జాగ్రత్తగా వినండి- మీ అప్ డేట్ చేసే కోరికలు చిట్టా మాత్రం ఏరోజుకారోజు- దేవుడికి చెప్పడం మర్చిపోకండి.ఎందుకంటే అయన “ప్రయారిటీ లిస్ట్ మైంటైన్” చేస్తున్నాడు ఈ మధ్య రద్దీ ఎక్కువైపోయి; అదీకాక “ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్డ్” అనే ఒక పాలసీ ఆయనా మొదలుపెట్టాడు జనాభాకంటే కోరికలు ఎక్కువగా ఉంటున్నాయిగా మరి!
ఇంకో విషయం కూడా- దేవుడికి ట్విట్టర్ ద్వారా కూడా మెసేజ్ చేయొచ్చు-ట్విట్టర్ పిట్ట- “పిట్ట కొంచెం కూత ఘనం” కదా- ఆగమేఘాలమీద అయన దగ్గరకు చేరవేస్తుంది.మీకు ట్విట్టర్ హేండిల్ లేకపొతే వెంటనే ఓపెన్ చేయండి (దేవుడి ట్విట్టర్ హేండిల్ విడిగా పంపిస్తా- మీలో ఎవరికైనా కావాలంటే- పబ్లిక్ డొమైన్ లో షేర్ చెయ్యలేను కదా) ఇప్పటికే మీరు “టెక్ సావి” అయి ఉంటే- ట్విట్టర్ లో దేవుడి హేండిల్ ఫాలో అయిపోండి-నేను మీకు చెప్పిన తర్వాత. ఇది మాత్రం ఓ ఎగేసుకుని పోటుగాడిలాగా అందరికీ చెప్పకండి- ఆఖరికి మీ ఇంట్లోవాళ్లకి కూడా- ఇందులో స్వార్ధం ఏమీలేదు. “తనకు మాలిన ధర్మం లేదని” శాస్త్రాల్లోనే ఉంది కదా.ఓవేళ ఇంట్లో వాళ్లకి మీరు ఈ విషయం దాచారని తెలిస్తే అప్పుడు మీకు తెలుసుగా ఎలా నాటకం ఆడాలో- మేనేజ్ చెయ్యాలో- ఈ కళలో మీరు ఆరితేరిపోయి ఉంటారు ఇప్పటికే- అమితాబ్ బచ్చన్ కంటే ముదురుగా!
ఓ వస్తువో, ఉద్యోగమో, పదోన్నతో అయితే కోరిక క్లారిటీతో ఉంటుంది-ఆలా కాకుండా ఉన్నవిషయాలకి సంబంధించి మాత్రం ఆ భారం దేవుడిమీద వెయ్యండి-మన తెలివితేటలూ ఉపయోగిస్తే ఇక్కడ దెబ్బతింటాం.
ఉదాహరణకి ఓమంచి ఉద్యోగం రావాలని కోరుకోవడం- ఇక్కడ ఉద్యోగ విషయంలో మంచికి లక్షన్నర అర్ధాలు-కోటిన్నర ఉద్యోగాలు ఉంటాయి.దాన్ని బట్టి ఏదో ఒకటి మీ చేతులో పెడితే అది మంచిదైనా మీకు ఇబ్బంది అయితే.
ఓ మాంచి కోడలు రావాలని కోరుకుంటే- మంచి కోడలు రావచ్చు-అత్తా మామలకి- కానీ కొడుకూ-కోడలూ మంచిగా ఉండకపోవచ్చు.మాంచి మొగుడు రావాలనే ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది (అబ్బాయి అయినా కూడా అనుకోండి) మీకు నే చెప్పే విషయం అర్ధం అయిందనుకుంటా!
ఇలాంటి విషయంలో అన్నిటికంటే శ్రేష్టమైన నా సలహా ఏమిటంటే...
దేవుడితో మీకోరిక చెప్పిన తర్వాత ఆ కోరిక విషయంలో ఆయనతో "నీకు ఏది మంచిది అనితోస్తే అది చెయ్యిబాబూ" అని ఓమాట అనేసి ఊరుకుంటే- బరువు- బాధ్యత ఆయనదే కదా- అన్ని రకాలుగా చూసుకొని- జాగ్రత్తగా అలోచించి మన కోరిక తీరుస్తాడు-రేపు మళ్ళీ ఆయన్నిమనం నిలదీయకుండా.
అర్ధమైందికదా కోరిక ఎలా స్పష్టంగా కోరాలో-ఇక నుంచి ఇలా చేయండి!ఇంకా సందేహాలుంటే విడిగా నాకు ఫోన్ చేయొచ్చు-మీ సందేహాలకు సమాధానాలకి!
మిఠాయి దుకాణం
అది ఓ పెద్ద మిఠాయిదుకాణం కాదు ఓ పెద్ద మాల్ లాంటిది, సమశీతోష్ణ శీతల వాతానుకూలీన యంత్రాలతో ఏర్పాటు చేయబడ్డది. అక్కడ కూర్చొని పదార్ధాలు సేవించడానికి ప్రత్యేకంగా ఒక అంతస్తు.నగరంలో ఉన్న ఏకైక పెద్ద ప్రదేశం, ఎక్కడా దొరకని తీపి, ఖారపు మరియూ అనేక రకాలైన పదార్థాలు దొరికే ప్రదేశం- ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి ప్రదేశం ఇంకెక్కడా లేదు.
ఉదయంనుంచి రాత్రివరకూ ఖాతాదారులతో జనసంద్రంగా ఉంటుంది-విపరీతమైన రద్దీ, అమ్మకాలు, సంపాదన!
ఇన్ని హంగులున్న ఆ ప్రదేశానికి మీరు యజమాని అనుకోండి- అంతకంటే అదృష్టం ఏముంటుంది- పరుల ఈర్ష్యపడేట్టుగా ఉంటే!
ఇక్కడే ఓ చిన్న మెలిక…. షరతులు వర్తిస్తాయి!
మీరు ఆ ప్రదేశం నుంచి ఒక్క అడుగు బయటకు వేయడానికి వీల్లేదు-జీవితాంతమునూ!
మీ ఆహారం అక్కడి పదార్థాలు మాత్రమే- బయట నుంచి ఒక్క శెనగబద్ద కూడా మీరు తెప్పించుకోకూడదు, తినకూడదు- జీవితాంతమునూ!
మీ విశ్రాంతి, బస, నిద్ర- సమస్తమూ అక్కడే-జీవితాంతమునూ!
అదేసమయంలో వేరే వ్యక్తులు తమ జీవితాన్ని కిందివిధంగా జీవించవచ్చు....
ఎక్కడికయినా వెళ్లొచ్చు!
ఏదైనా తినొచ్చు!
ఏమైనా చెయ్యొచ్చు!
అనుదినం పరులకు సాయపడవచ్చు!
ఇతరులతో- రకరకాల వ్యక్తులతో ముచ్చటించవచ్చు!
విందులూ-వినోదాలకు వెళ్ళవచ్చు!
శుభకార్యక్రమాలు చేయవచ్చు, వెళ్ళవచ్చు!
ప్రకృతిలో మమైకమే ఉండవచ్చు!
పరులని ఆదరపూర్వకంగా ప్రేమించవచ్చు!
ఆకలి, దప్పికలు అవుతున్నప్పుడు ఇష్టమైన పదార్థాలు స్వీకరించవచ్చు!
మీ దైనందిన జీవితములో అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు!
బంధుమిత్రుల వద్దకు మీరు వెళ్ళవచ్చు, మీ ఇంటికి వాళ్ళు రావచ్చు!
స్వేచ్ఛగా, స్వతంత్రంగా కట్టడి లేకుండా జీవించవచ్చు!
మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళవచ్చు!
వేరే ప్రాంతాలకి, వివిధ నగరాలకు, వివిధ దేశాలకు వెళ్ళవచ్చు!
వైవిధ్యంగా జీవించవచ్చు!
వైవిధ్యమైన, విభిన్న సంస్కృతులను చూడవచ్చు, అనుభవించవచ్చు ఆస్వాదించవచ్చు!
విభిన్న రుచులని చవిచూడవచ్చు!
ఆంక్షలు,కట్టడిలేని(చెడ్డవి కాని), జీవితాన్ని కొనసాగించవచ్చు!
నిత్యకర్మలు, సత్కర్మలు చేయవచ్చు!
దానధర్మాలు చేయవచ్చు!
అన్నిరకాల భావోద్వేగాలకు గురికావచ్చు,అనుభంలోకి రావచ్చు!
ఒక్కమాటలో చెప్పాలంటే షడ్రసోపేతమైన మృష్టాన్నభోజనం లాంటి జీవితాన్ని అనుభవించవచ్చు!
ఇప్పుడు చెప్పండి-మీరు ఆ మిఠాయి దుకాణం యజమానిగా ఉండటం అదృష్టమా- ఇంకో వ్యక్తిగా ఉండటం అదృష్టమా!
ఈ ఇద్దరి వ్యక్తుల్లో ఎవరు నిజమైన జీవితాన్ని సాగిస్తున్నారు!
.
.
మీరుగా ఊహించుకునే మిఠాయి దుకాణం యజమాని "దేవతలు"-అమరులు-అజరామరణాలు లేనివారు-స్వర్గలోకంలో ఉండేవారు!
ఇంకో వ్యక్తి-భూలోకంలో “మానవులు”- పునర్జన్మ కలిగేవారు-అన్నికర్మలు చేయకలిగినవారు!
ఇప్పుడు చెప్పండి దేవతల జీవితం గొప్పదా-మానవుల జీవితం గొప్పదా!
మనకు జీవితంలో ఉన్న అవకాశాలని నిర్లక్ష్యం చేస్తాం- మనకు ఉన్నవాటికి,మన చుట్టూఉన్న మనుషులకి విలువ ఇవ్వలేకపోతున్నాం -వాటి విలువ- విలువ కట్టలేనిది అని తెలుసుకోలేకపోతున్నాం.
సకల చరాచర జీవుల్లో మానవజన్మ ఉత్కృష్ట మైనది- అది గ్రహించి సంతోషంగా ఆనందంగా జీవిద్దాం-ఇక్కడ ఉన్నన్నాళ్ళు!
గరుడ పురాణం
ఇండియన్ కాన్స్టిట్యూషన్ (భారత రాజ్యాంగం) ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలుసుకోవడం ఎంతముఖ్యమో ఇది తెలుసుకోవడం కూడా మనజీవితంలో మంచిదేకాదు ముఖ్యం కూడా! ఇంకా చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ (భారత రాజ్యాంగం) ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలియకపోయినా పర్వాలేదుగానీ, మనిషిగా పుట్టిన ప్రతీవాళ్ళూ గరుడ పురాణం తెలుసుకోవడం, చదవడం ముఖ్యం!
మనం చేసే చెడ్డపనులవల్ల నరకలోకంలో ఏమేమి శిక్షలు పడతాయో చూచాయగా అన్నా తెలుస్తాయి.భూలోకంలో తప్పులుచేసే ప్రతీవాడూ చట్టానికి పోలీసులకి దొరకరు కదా.దొరికితేనే దొంగ ఇక్కడ, దొరకనివాడు దొర-ఇలాంటి దొరలు అక్కడ తప్పించుకోలేరు.
నాస్తికులయినా,ఇలాంటివి నమ్మనివాళ్ళయినా తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, తెలియడం మంచిది కూడా.అలాగే అందరూ ఎందుకు తెలుసుకోవాలంటే- మన మనసు మనమాట వినకుండా ఒక్కొక్కసారి తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది.మనం బలహీనక్షణంలోకి వెళ్లకుండా ఇది కొంతవరకు మనల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది.ఓవేళ ప్రలోభానికి లోనయి మనం ఆ చెడుపనులు చేస్తే పరిణామాలు, శిక్షలు తెలుస్తాయి-ఈ గరుడ పురాణం గురించి తెలుసుకుంటే!
దీని పేరు వింటేనే ఉలిక్కిపడి ఏదో వినరానిపదం విన్నట్టుగా కూడా కొంతమంది మొహాలు పెడతారు.గరుడపురాణం ఇంట్లో ఉండకూడదు ఏదో అపశకునం, చదివినా,పుస్తకం ఇంట్లో ఉన్నాఅశుభం అనీ ఓ మూఢనమ్మకం ఉంది ప్రజల్లో.
ఆరోజుల్లో పెద్దలు ఈమాట చెప్పడానికి ఆనాటి పరిస్థితులు,ఇతర కారణాలు ఉండిఉండొచ్చు.
అందులో రాసిన శిక్షలు చాలా క్రూరంగా ఉంటాయని,అదీకాక ఇవి అమలుజరిగేది మనిషి పోయినతర్వాత అవడంవల్ల అదేదో అశుభం అని అయిఉండొచ్చు; బతికుండగానే అవి చదివితే తొందరగా మరణిస్తామనీ-ఇలా అర్ధంలేని అపోహలు ఉండిఉండొచ్చు!
ఏం మనం ఇప్పుడు నివసించేలోకంలో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నవాళ్ళ గురించి చదవట్లేదా,ఇంతకంటే ఘోరాలు సినిమాల్లో సైతం చూపించడం లేదా.కనీసం గరుడపురాణం చదవడంవల్ల ఒక అవగాహన ఏర్పడుతుంది- దానితో మనిషి తప్పు చేయాలంటే కొద్దిగా బెరుకు ఏర్పడుతుంది- పాపభీతి ఉంటుంది.
అంతేకాక మనిషి ఏ విధంగా జీవించాలి,జీవించకూడదో కూడా తెలియచేస్తుంది. తెలిసిచేసినా, ఫలితం తెలియక చేసినా తప్పు తప్పే- శిక్ష తప్పదు-"ఇగ్నోరెన్సు అఫ్ లా ఈజ్ నో ఎస్క్యూజ్" అని మన భూలోక చట్టాలలో మనం రాసిందేగా!
అయినా ఈ గరుడపురాణం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వయానా గరుత్మంతునికి వైకుంఠంలో చెప్పిందే, “అష్టాదశ పురాణాల్లో” ఇది కూడా ఒకటి.ఇది వేదవ్యాస విరిచితమై సౌనకమహాముని ద్వారా భూలోకంలోని మానవులకి సంప్రాప్తించింది.
ఇది చదివితే తొందరగా పోతామనో, చదవకుండా ఉంటే ఎక్కువ కాలం ఇక్కడుంటామనో అనుకునేవాళ్లు కూడా ఉండొచ్చు; చదివినా-చదవకపోయినా నిర్ణయించినకాలం దాటి ఓ సెకనుకూడా ఉండం ఈగ్రహంమీద.
నా ప్రకారం-మూఢనమ్మకాలకి పోకుండా ప్రతి ఒక్కరు చదవ వలసిన గ్రంధం ఇది!
ధర్మం యొక్క శక్తి...
ఆస్తికుడు అయినా!
నాస్తికుడు అయినా!
ఏ మతం వారైనా!
ఏ కులం వారైనా!
కమ్యూనిస్టు అయినా!
నియంత అయినా!
ప్రజాస్వామ్య వాది అయినా!
రాచరికపు మనిషి అయినా!
ధర్మాన్ని నువ్వు నమ్మినా!
నమ్మకపోయినా!
బీదా బిక్కీ- రాజూ పేదా అనే బేధమే లేదు!
ధర్మం మీద వాళ్లకు నమ్మకం వున్నా లేకపోయినా!
ధర్మం అనే పదం వినకపోయినా, తెలియకపోయినా!
ధర్మం అనే పదం యొక్క అర్ధం తెలిసినా తెలియక పోయినా!
ధర్మాన్ని ఎవరు తప్పినా!
సమయానికి తగ్గట్టుగా ధర్మం తన పని తాను చేసుకుంటూ సాగుతుంది! ధర్మం- ఆ అధర్మంమీద విజృంభిస్తుంది, ఇది చరిత్ర, మన పురాణాలు, ఇతిహాసాలు చెప్పిన నగ్నసత్యాలు-మనం నిత్యం కళ్ళముందు చూసే నిష్టుర సత్యం! ఏ కారణంచేత ధర్మాన్ని ఉపేక్షించినా,వాళ్ళు ధర్మం వేయబోయే శిక్షకి సిద్ధం అయిఉండాల్సిందే (సిద్ధం అవకపోయినా ధర్మానికి ఆ పట్టింపేమీలేదు)
సృష్టిలో ఎవరినీ ఉపేక్షించదు;నీ,నా తేడాలేదు- ఎవర్నీ వదలదు- కర్మకంటే మిక్కిలి బలీయమైనది.
ధర్మాన్ని ఆలంబనగా చేసుకొని బతికేవాళ్ళ చెంతనే తోడుగా, కవచంలా ఉండిపోతుంది-వారి కడవరకూ!
“ధర్మో రక్షతి రక్షితః”
కష్టాలు-సుఖాలు
సూర్యరశ్మి రోజూ రాకపోవచ్చు-ఒక్కొక్కసారి సూర్యుడే కనపడకపోవచ్చు,అలా అని సూర్యుడు లేడు అని అనలేం కదా.మనం అనుకున్నవి అన్నీ జరిగితే దేవుడు ఉన్నట్టు,జరగకపోతే దేవుడు లేనట్టే అనే భావన ఎంత అవివేకం,అజ్ఞానం వానాకాలంలో సూర్యుడు కొన్ని రోజులు కనపడడు.
కష్టాలు అనేవి వర్షాకాలంలోవచ్చే వానలలాంటివి;ఇబ్బందిపెట్టినా- మన జీవితం గడవాలి అనుకుంటే తిండి, నీరు కావాలి కదా. చిరాకుగా ఉంది, ఇబ్బంది పెడుతోంది అని అసలు వర్షాకాలమే వద్దనుకుంటే మానవాళి మనుగడ- ప్రకృతి ఎలా ఉంటాయో ఊహించుకోలేం!
అలాగే జీవితంలోని కష్టకాలాలు మనల్ని ధైర్యవంతుల్ని చేస్తాయి.వాటిని ఎదుర్కొనే సామర్ధ్యం, తెలివిని పెంచుతాయి కూడా.ఇంకొక లాభం ఏమిటంటే ఒక్కసారి కష్టం చూసిన తరువాత ఏకష్టం మనల్నికష్టపెట్టలేదు మనకు ఎదుర్కొనే సామర్ధ్యం ఉంది కనుక.
అన్ని ఋతువులు, కాలాలు ఆయాసమయాల్లో తేవడం ప్రకృతి ధర్మం,ఏడాది పొడుగునా, ప్రకృతి ఉన్నంతకాలం- అది నిరంతరం,చిరంతరం.ఈ క్రమంలో ఒక ఋతువు సరిగ్గా లేకపోయినా,విఫలం అయినా మనం చూస్తూనే ఉన్నాం పరిస్థితులు ఎలా ఉంటాయో.
అలాగే జీవితం అన్నాక అన్నిరుచుల సమ్మిళితమైన మిశ్రమం,“షడ్రుచుల” భోజనం లాంటిది-"తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు"- ఆస్వాదించకుండా ఎలాగుంటాం-ఇందులో ఏది తగ్గినా,లేకున్నా అది పూర్తిజీవితం కాదు-అన్నీ ఇష్టంగా ఆస్వాదిద్దాం!
శివతత్వం సూక్ష్మంగా...
“జీవి” శరీరంలోజీవంగా ఉంటే శివమ్ నిర్జీవం అయితే శవం ఆ జీవి ఆత్మ శివునిలో విలీనం అవటమే శివోహం!
నీవు శరీరానివి కాదు కదా ఆత్మ అయ్యేది శివైక్యమేగా- అది నీవేగా ఏది తెచ్చావని ఈలోకానికి కోల్పోతావనే ఈ వెధవ బెంగ!
మన కాలాన్ని-దాని నియమాన్ని,నియంత్రిచేది నిర్థారించేది,చివరికి “నిశ్చలం” చేసేదీ కైలాసానికి పయనం అయ్యేది ఆయనలో “ఐక్యం” అవడానికే కదా!
“నువ్వూ- నేనూ” “నాదీ- నీది” అనేదే లేదు ఆ శివతాండవంలో మనం అందరమూ భాగస్వాములమే కదా సకల శకలాలతో సహా సకలం శివైక్యమే!
శివమ్, శివతత్వం అతి సూక్ష్మం- “చేతిలో ఉసిరికలా బోధపడుతున్నా” అర్ధంకానట్టు నటిస్తూ- అర్ధం చేసుకోవడానికి కష్టపడే ప్రయత్నం చేస్తుంటాం!
ఇంత చిన్నపాటి శివతత్వం తెలిసినా-తమకు అన్వయిన్చుకోకుండా- శివారాధన చేసినా, శివలింగాలు మెడలో వేసుకున్నా, లింగార్చనలు చేసినా, విభూతి ఒంటినిండా రాసుకున్నా- శివరాత్రి జాగరణ చేసినా, ఉపవాసం ఉన్నా నిష్ప్రయోజనం; ఈ జీవితం బూడిదలో పోసిన పన్నీరేగా!
ఎంత పూర్వజన్మసుకృతం లేకపోతే ఈ మానవజన్మ వచ్చింది.కొద్దిగా అయినా ఈ దారిలోని మెట్లు ఎదగకపోతే ఎలా!
రాబోయేది మానవజన్మ రావాలని ఇంతకంటే మెరుగుగా ఉండాలని ఉత్తికోరిక ఉంటే చాలదుగా- సాధన కావాలిగా మరి!
ఓమ్ నమశివాయ!!
కాటికాపరి అంతరంగం
నన్ను చూడాలనిగాని కలవాలనిగాని ఎవరికీ అనిపించదు-సాధ్యమైనంతవరకు నేను అందరికి అంటరానివాడనే-ఒక్క నా కుటుంబానికి తప్ప.నేను కాటి దగ్గరగా నివసిస్తా- ఎప్పటికైనా "కాటిలోకి" వెళ్ళవలసినవాడనే కదా.మాకూ బంధువులు ఉన్నారు-కానీ ఒక్కరుకూడా చుట్టపుచూపుగా కూడా రారు- వాళ్ళూ పోయినప్పుడే వస్తారు- చివరగా మేం చూడటానికి!
మా ఇంట్లోవాళ్ళు మాఇంట్లో పనిచేసుకోవాలితప్ప వేరేఇళ్లకు రానివ్వరు- మమ్మల్ని బయట చూసి ఎవరైనా గుర్తుపట్టితే, పక్కకు తప్పుకుంటారు- అంటరానివాళ్లమా!!!అంటరానితనం పోలా సమాజంలో-కాటికాడ అవేమీ ఉండవు అని తెలిసినా కూడా!
నాకు మాత్రం మనసు లేదా,ఆశ ఉండదా,రోజూ మీలాగే ప్రాణంతోవుండే మనుషుల్ని చూడాలని, మాట్లాడాలని.కానీ ఎవరూ రారే నాదగ్గరకి, నేనేం చెయ్యను అందుకే ఇక్కడ నిర్జీవులతోనే అలవాటు అయిపొయింది.నాదేమీ రాతిగుండె కాదు, కసాయివాణ్ణీ కాదుగా-నేనూ ప్రాణంతో ఉన్న మనిషినే!
నా వృత్తి ఇది, నా కుటుంబ ఉదరపోషణకోసం చేసే పనే ఇది,అలాఅని ఎక్కువ నిర్జీవులు రావాలని ఎదురుచూసే మనిషిని కాదు.ఎవరైనా జీవంతో ఉన్నవాళ్ళు వచ్చి నాతొ మాట్లాడితే బాగుంటుంది అని నాకూ అనిపిస్తుంది- నాతో మాట్లాడేది నిర్జీవులతో వచ్చే జీవులుమాత్రమే- అదేమీ చిత్రమో నిర్జీవుల తోడులేకుండా ఏఒక్క జీవీ ఇక్కడకి రాదు- భయం అనుకుంటా!
నిర్జీవులని చూడటంవల్ల జీవన తత్త్వం,పుట్టుక-మరణం చాలా సులభంగా, తేలికగా తీసుకోవడం అలవాటయ్యింది . శివయ్య తత్త్వం నాకు తెలిసినంతగా వేరెవరికీ తెలియదు; అందుకే- నాకూ తెలుసు ఏదో ఒకరోజున ఆ చితిపై నేనుంటానని- నాకేమీ అనిపించదు-నేను నివసించే చోటే శాశ్వతంగా ఆ నేలలో కలిసిపోతానుగా- అంతకంటే ఏం కావాలి!కానీ- శివయ్య దగ్గరకి వెళ్ళినప్పుడు మాత్రం చెపుతా, వచ్చే జన్మలో అయినా ఈ వృత్తి ఇవ్వొద్దని!
నువ్వు ఎక్కడ,ఎలా పుట్టినా,ఏ వృత్తిలో ఉన్నా“చివరి మజిలీ ఎవరికైనా,నీకైనా ఇదే కదా” అని అనొచ్చు శివయ్య నవ్వుతూ- అదీ నిజమే- కాదు అదే నిజం.
అందుకని జీవితం చివరివరకూ, ఈ మజిలీకి చేరుకునేంతవరకూ మీచుట్టూ ఉన్న జీవం ఉన్న వ్యక్తులతో హాయిగా, ఆనందంగా కాలం గడపండి- ఇది నా మాటగా తీసుకోండి.
పాత్రలు-పాత్రధారులు
సినిమా తీసేటప్పుడు పాత్రలు, పాత్రధారులు ఉంటారు,ఇక్కడ పాత్రదారులు వారి వారికి కేటాయించిన పరిమితిలో,నిడివిలో,నిర్దేశించిన సమయం వరకూ పనిచేస్తారు పాత్రలు,పాత్రధారులు నిమిత్తం మాత్రమే-నిర్మాత అయినా అంతే!
ఈ పాత్రని ఎలా నడిపించాలో,కథనం ఎలా సాగాలో నిర్ణయించేది పూర్తిగా దర్శకుడే!
చిత్రం మొదలు పెట్టినప్పుడే ముగింపు రాసినవాడు, తెలిసినవాడు రచయితే కానీ- స్వేచ్ఛగా ముగింపు మార్చకలిగినవాడు,మార్చేవాడు దర్శకుడు మాత్రమే!
రచయిత తన కధ ఇవ్వడం వరకే తన పాత్ర బాధ్యత- తనకు నచ్చిన,తోచిన ముగింపుతో!
పాత్రదారులు వారి పాత్రని బట్టి వచ్చిపోతూ ఉంటారు!
కొన్ని పాత్రలు నేపథ్యంలోనే ఉంటూ-పాత్రధారుల కంటికి కనపడకుండా-పరోక్షంగా దోహదపడతారు, ప్రభావితం చేస్తారు కథని, కధలోని పాత్రలనీ!
ఇది తెలియని మనిషి ఈ భూ ప్రపంచములోనే ఉండరు కూడా!
మన జీవితం కూడా అంతే!!!
మన జీవితపాత్ర పోషిస్తూ-ఎవరి జీవితాల్లో ఎంతవరకు మనపాత్ర ప్రమేయమో! అలాగే వేరే పాత్రలు కూడా మన జీవితంలోకి వచ్చిపోతుంటాయి!
ఏ పాత్ర ఎప్పుడూ అచ్చంగా మనతోనే ఎల్లప్పుడూ మనతోడై ఉండిపోతుందనే ధీమా ఉండదు!
ఎలాంటి షరతులు, నియమాలతో ఏ పాత్రా దాదాపుగా ఉండదు!
మనం పరులజీవితంలో పాత్రలు పోషిస్తాం మనమేర, అలాగే పరులు కూడా అంతే మన జీవితంలో!
ఈ జీవితం అనే వేదికపై మన పాత్ర కనుమరుగయ్యేంతవరకూ మనం మనపాత్రని పోషిస్తూనే ఉంటాం!
ఇన్ని పాత్రలని,పాత్రధారులని ఏకతాటి మీద నడిపించే నిర్దేశకుడు,జగద్దర్శకుడు ఆ పరమాత్మే!
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి-ఈ వేదికపై కొంతమంది పాత్రధారులు అర్దాంతరంగా కనుమరుగయిపోవడం సహజం.అయినా కూడా ఈ వేదికపై ప్రదర్శన నిరంతరంగా,చిరంతరంగా సృష్టి ఉన్నంతవరకూ సాగుతూనే ఉంటుంది. ఏఒక్క పాత్ర నిష్క్రమణతో ఈవేదికపై ప్రదర్శన ఆగదు,పాత్రధారులు మాత్రం మారతారు-పాత్రలు మాత్రం అవేఉంటాయి- కొద్ది మార్పుతో-అంతే!
మనకిచ్చిన ఈ అవకాశం వృధాచేయకుండా మన జీవితపాత్రని సాధ్యమైనంత వరకూ ఇతరుల జీవితాల్లో కూడా ఆనందం కలిగించేవిధంగా ఉండటమే ఈమానవ జన్మకి చరితార్థం!
అసలు ప్రతిరోజూ దేవుడికి దండం పెట్టడం ఎందుకు....
ప్రతిరోజూ ఉదయమే నిత్యపూజ చేసేవాళ్లు చాలామంది ఉంటారు-ఏకనామ, దశనామ, శతనామ,సహస్రనామ పారాయణలతో-ఎవరి శక్తీ,ఓపికని బట్టి.
మనకీమానవ జన్మనిచ్చిన, మన ఉనికి కారణమైన, మన ఊపిరిగా మారిన ఆయన్ని స్మరించుకుని ఆయనను స్తుతించడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది- కనీస ధర్మం కూడా, అదీ నిష్కామంగా-ప్రతీ రోజూ- మన కోరికల చిట్టాలు విప్పకుండా!
అనునిత్యం కోరికలు కోరడం, రోజూ మహిమలు జరగాలని అనుకోవడం కూడా స్వార్ధమే-మనం రోజూ,ఈ క్షణం కూడా ఊపిరి తీసుకోవడం మహిమ కాదా, అంతకంటే ఇంకేం కావాలి?
ప్రతీసారి దేవుడికి దండం పెట్టడం అంటే-మన కోరికల చిట్టాలు విప్పడం కాదు, లేదా ఓ కొత్తకోరిక కోరటం కోసంగా కాదు-ఆ దేవుణ్ణి స్మరించుకోవడం మాత్రమే,ఈ రోజు మన ప్రవర్తన, బుద్ధి సక్రమంగా ఉండేట్టు చేయమని,అనవసర ప్రలోభాలకు లోనుకాకుండా చూడమని-ఇబ్బందులున్నా- చులాగ్గా కాకపోయినా, కొద్దిగా తిప్పలు పడ్డా పరిష్కరించుకునే శక్తినీ ఇమ్మని!
ప్రశాంతమైన మనసుతో ఆయనని అంతరంగంలో కూడా తలచుకోవాలి-గుడికి వెళ్ళినప్పుడే కాదు -ఒక్క పెదవులతో ఆయన నామస్మరణకాదు,పెదాలపని పెదాలు, కానీ మన మనసుపని మాత్రం దేవునిపై లగ్నం చేయడమే.
అంతేకాని మనసుని “పగ్గం విడిచిన గుర్రంలాగా” దాని మానాన దాన్ని స్వేచ్ఛావిహారానికి వదిలేసి-పెదవులు యాంత్రికంగా ఉచ్చారణ చేసుంటూ చేసే పూజవల్ల వచ్చేఫలితం సున్నా.ఏదో మన ఆత్మతృప్తికి మొక్కుబడిగా చేసే ఒక దినచర్య కాదు పూజా ప్రార్ధనా అంటే అది నిష్కామంగా చేసే ప్రక్రియ మాత్రమే!
చాలామందికి తరచు దేవాలయాలకి వెళ్లే అలవాటు ఉంటుంది,సాధారణంగా వీళ్ళు కొంత సమయం కేటాయిస్తారు భగవత్ స్మరణకోసం అక్కడకు వెళ్లి.అవకాశం, వెసులుబాటు లేనివాళ్ళు, సమయాభావంవల్ల మనసులోనే భగవంతుణ్ణి స్మరణ చేసుకోవచ్చు మనసుని లగ్నంపెట్టి-మొక్కుబడిగా కాకుండా!
ఏదో తరచూ దేవాలయాలకు వెళ్ళేవాళ్ళే భక్తులు, వెళ్లకుండా ఇంట్లోనే భగవన్నామస్మరణ చేసేవాళ్ళు భక్తులుకారు అనికాదు అర్ధం-ఇది ఏ శాస్త్రాల్లోనూ పురాణాలలోనూ ప్రస్తావించలేదు.తరచూ దేవాలయాలకి వెళ్లనివాళ్లలో కొంతమందికి ఈ ఆత్మన్యూనతాభావం ఉండటం మనం చూస్తుంటాం.
రోజులో ఇరవైనాలుగు గంటల సమయంలో కొన్నినిమిషాలు భగవంతుని స్మరణకు కూడా సమయం లేదా మన దగ్గర-మనకి ఇబ్బంది, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే తలుచుకోవడం ఏమాత్రం బాగుంటుంది-స్వార్ధం,అధమత్వం కాదూ; “దేవుడు అనేది అవసరార్ధం వాడుకుందాం అనే మానవ సంబంధాలు కాదు” ఈ విషయంలో,రుజువులు అక్కర్లా,ఎవరూ ధృవీకరించనక్కర్లేదు-మన మనస్సాక్షే సాక్ష్యం !
మనకీ మానవజన్మ ఇచ్చిన ఆయన్ని స్మరించుకునే సమయం లేదు కానీ, “ఈ గ్రహం మీద ఎక్కువ సమయం గడపాలనే యావ విపరీతంగా ఉంటుంది”! ఇది ప్రతి మానవుడు మిక్కిలి అమితంగా కోరే కోరిక- రోజూనూ.అంతేగానీ ఈ కోరే కోరికలో,ఎక్కువ సమయంలో సక్రమబుద్ధితో ఉందామని అనుకునేవాళ్ళు, ఉండేవాళ్ళు ఎందరు!
అంతేగానీ కోరిక పుట్టినప్పుడు ఆయన్ని గుర్తుతెచ్చుకోవడం,లేదంటే ఆయన గుర్తుకొచ్చినప్పుడు- కోరికల్ని గుర్తుతెచ్చుకొని ఏకరువు పెట్టడం మానేద్దాం.మన దగ్గర ఏమిఉన్నాయో,మనకు ఏవి,ఎప్పుడు ఇవ్వాలో ఆమాత్రం తెలియదా ఆయనకి!
నాస్తికునికి,ఆస్తికునికి-అస్థిత్వం కలిగించేది ఆ భగవంతుడే!సృష్టి, స్థితి,లయల ప్రభావంలో,ఒరవడిలో అందరూ కలసికట్టుగా ప్రయాణం చేయాల్సిందే ఆఖరి శ్వాసవరకూ!
మనం జీవించడం ప్రలోభాలతోనా, ప్రలోభాలకు లోనుకాకుండానా అన్నది పూర్తిగా వ్యక్తిగతం- వారి వారి పూర్వజన్మ సుకృతం,సజ్జన సాంగత్యం!
ఇదే మాటను మన పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో వేలశతాబ్దాలుగా ఘోషిస్తున్నాయి.ఈ కలికాలంలో పెద్దలు, గురువులు,ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఇదే విషయాన్ని మనకు తత్త్వం బోధపడేట్టు మనకు చెప్తూనే ఉన్నారు.
ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు చెప్పండి- వినడమా,మానడమా అనేది మన ఇష్టం!
మనకు నిత్యజీవితంలో సహాయం చేసినవాళ్లను కృతజ్ఞతా భావంతో చూస్తాం, వాళ్లకు వ్యక్తం కూడా చేస్తాం సందర్భాన్ని బట్టి- కొందరివిషయంలో అందరికి చెపుతాం కూడా ఆ సహాయం చేసినవాళ్ళ గురించి. మరి మనకీ మానవ జన్మనిచ్చిన దేవుడికి నిష్కామంగా కృతజ్ఞత చెప్పాలని ఎవరో చెప్పాలా!
జీవిత సత్యం తెలుసుకోవడానికి సులభమైన మార్గం!!!
మీరు రామాయణ మహాభారతాలు, భాగవతాలు పుక్కిట పట్టలేదని బాధ పడుతున్నారా, భగవద్గీత పుస్తకం ముట్టుకోలేదు అని అనుకుంటున్నారా, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, వేదాల పేర్లే తెలియవని వాపోతున్నారా, ఏమాత్రం చింతించక్కర్లా.అసలు వీటిల్లో విషయ ప్రస్తావన, సారాంశం, తాత్పర్యం, తత్త్వం ఏమిటో కొద్దిగా తెలిసినా మానవ జీవితం మీద,మన పుట్టుక మీద అవగాహన ఏర్పడుతుంది.
ఒక పరిపూర్ణ మానవుడిగా-ధర్మ బద్ధంగా,నిజాయితీగా,న్యాయంగా, నిస్వార్ధంగా మీరు బతుకుతున్నట్టయితే పైన చెప్పినవి చదవకపోయినా, తెలియకపోయినా పర్వాలేదు,ఆక్షేపణే కాదు.ఎంచేతంటే అవేమి చదవకుండానే వాటిలోని సారాంశం మీలో నిక్షిప్తమై ఉంది, నరనరాల్లో,కాదు కాదు కణకణాల్లో -మీకు తెలియకుండానే- అది మీ తల్లి తండ్రుల సంస్కారం, మీరు పెరిగిన వాతావరణం,మీదు మిక్కిలి మీ స్వభావంవల్ల అయిండొచ్చు-నాప్రకారం అది మీ పూర్వజన్మసుకృతం!
ఇలా జీవించకుండా, ఇంకోరకంగా జీవించేవాళ్లకి చిన్న కిటుకు చెపుతా “జీవిత సారాంశం” తెలుసుకోవడానికి, పైన పేర్కొన్నవి చదవకపోయినా,వాటిమీద అవగాహన లేక పోయినా!
ఒక రోజో,రెండు రోజులో,వారం రోజులో- అది మీయొక్క అవగాహనని బట్టి,గ్రహింపునిబట్టి ఆధారపడి ఉంటుందనుకోండి.మీకు పార్కులో ఉదయపు నడకగానీ, యోగ, ప్రాణాయామ గట్రాలాంటి అలవాటు ఉండిఉన్నవాళ్లయితే ఈ కార్యక్రమాలన్నీ అయినతర్వాత మనసు శరీరం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటుంది కూడా.అప్పుడు కొన్నినిమిషాలు కళ్ళుమూసుకుని కింది విధంగా అనుకుని మీకు మీరు ఊహించుకోండి.ఒక వేళ మీకు ఇలాంటి అలవాటు లేకపొతే మీ ఇంట్లోనే మీరు పొద్దున్నే లేవగానే రెండు మూడునిమిషాలు కళ్ళు మూసుకొని కూడా కిందివిధంగా అనుకుని మీకు మీరు ఊహించుకోవచ్చును.
“నేను ఈ భూమిమీద లేని రోజున-ఎక్కడైనా, ఎవరికైనా, ఏ మాత్రమైనా తేడా వస్తుందా- నా అనుకునే సొంతవాళ్ళు బతకడం కష్టమా, సూర్య చంద్రాదులు గతులు తప్పుతారా, ప్రకృతి స్తంభిస్తుందా, ఒక లిప్తకాలం అయినా సమయం ఆగిపోతుందా నేను లేనని”.ఇదే పలుమార్లు చేయడంవల్ల ఊహించుకోవడంవల్ల-మీకు ఇష్టంలేకపోయినా,ఒద్దన్నా ఒక కఠోరసత్యం సాక్షాత్కరిస్తుంది మీ మస్తిష్కంలో!
“ఒక్క ఇసుమంత తేడాకూడా రాదు ఈ ప్రపంచంలో నేను అనే మనిషిని లేని రోజున”అనే తత్త్వం బోధ పడుతుంది; కంగారు పడకండి ఈ అనుభవానికి- ఎందుకంటే ఇది అక్షరసత్యం,నిష్టుర సత్యం.ఇది గ్రహించకుండా “చాగంటి గారి”, “గరికపాటి గారి” ప్రవచనాలు విన్నా,భక్తి టి.వి లో వచ్చే ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు విన్నా-గుళ్ళకివెళ్లినా, పండగలప్పుడు రెచ్చిపోయి సంబరాలు చేసుకున్నా వృధాయే.
నేను చెప్పిన చిన్నప్రయోగం కష్టమైనది- అసాధ్యమైనది కాదు, దమ్మిడీ ఖర్చు కూడా అవదు,పై పెచ్చు జీవితతత్త్వం బోధపడుతుంది.మనం ఇక్కడకి వచ్చిన పరమార్ధం బోధపడుతుంది.
ఇదేదో నేను పరిశోధించి చెప్తున్న విషయం కాదు, ఆతర్వాత మీ ఇష్టం.ఎవర్ని ఎవరు శాసించగలరు,ఎవరు ఎవరికి చెప్పగలరు. ఈరోజుల్లో భగవంతుడికే దిక్కులేదు-మనకు కావాల్సినవి అడగటానికి మాత్రం టక్కున భగవంతుడు గుర్తుకొస్తాడు; “ఇస్తావా-చస్తావా” అని గోలపెడతాం ఆయనతో ఇంట్లోవాళ్ళతో దెబ్బలాడినట్లు-మనకు కావాల్సినవి ఇచ్చేంతవరకు.కానీ ఆయన చెప్పే బోధనలకు మాత్రం దిక్కేలేదు- ఆయనే ఏం చెయ్యలేక చూస్తున్నాడు పాపం మనల్ని సృష్టించిన పాపానికి!!!
ఆ…. మాకెందుకు ఈ వేదాంతపు కబుర్లు అంటారా.అలాక్కానివ్వండి ఈజన్మకి-మీ ప్రకారం,మీరు అనుకున్న ప్రకారం,మీ ఇష్ట ప్రకారం మీరు బతికేయండి-యథేచ్ఛగా!!
ఏది ఏమైనా సంతోషంగా మాత్రం బతకడం మర్చిపోకండి కనీసం,కొంతలోకొంత అది మెరుగు!
భూగ్రహ గృహం తాత్కాలికమే!!
అందరూ ఈగ్రహాన్ని,తాత్కాలికగృహాన్ని వదిలి ఏదోరోజున మన అసలు,సొంత గృహాలకి వెళ్లవెలసిన వాళ్లమే.అందరం ఏదో చుట్టపుచూపుగా అందర్నీచూసి కొన్నాళ్ళు అందరితో ఆనందంగా గడిపి మనజ్ఞాపకాలను,తీపి గురుతులను ఇక్కడివారికి వదిలి వెళ్లడమే- “ఇష్టం ఉన్నాలేకపోయినా” (మనకు అన్నీతెలిసినా ఈ పీకుడు,ఆశా,వ్యామోహాలవల్ల మనం ఒప్పుకోలేకపోతున్నాం మనలోమనం-మనసులో ఒప్పుకున్నా) అంతేగానీ ఇక్కడే పీఠంవేసుకుని కూర్చుండాలి అంటే అది కుదిరే పనికాదు.కారణజన్ములు అయిన పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా దేహాన్నివిడిచి వెళ్ళిపోతారు వాళ్ళువచ్చిన కార్యసిద్ధి అవగానే- సామాన్యులమైన మనమెంత!
మళ్లీ కొన్నాళ్లకు కొత్త ప్రయాణం-కొత్త రూపాలతో,కొత్తవాళ్ళతో,కొత్త ప్రదేశాలలో కొత్త అనుభూతులతో,కొత్త జ్ఞాపకాలతో,కొత్త పరిచయాలతో;కొందరు పాత మిత్రులను, ఆప్తులను గుర్తుపట్టే శక్తితో తిరిగివస్తాం-ఇప్పటి లాగానే-మరి ఇంకెందుకు బెంగ!!!
ఇది నిరంతర ప్రయాణం,అంచేత ఈ పర్యటనని బాగా ఆస్వాదిద్దాం నిత్యం సంతోషంతో,ప్రేమ ఆప్యాయతలకు నిర్వచనం చెబుదాం.నిస్వార్థంగా ఉండటం ఎలాగో చేసిచూపిద్దాం.నీ-నా అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఎలా మెలాగాలో అందరికీ నేర్పుదాం.
ఒక్కోసారి మన“ఆ ఇంటినించి” అత్యవసరంగాకబురు వస్తే అర్ధాంతరంగా వెళ్ళవలసి వస్తుంది (ఇక్కడ మనం ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇంటినుంచి కబురు వస్తే వెళ్తామే అలాగన్నమాట) కాకపోతే ఈ ఇంటినుంచి ఆ ఇంటికి చాలాదూరం కావడం మూలాన మళ్ళీ మనం ఇక్కడకు వచ్చేసరికి అందరి రూపురేఖలు మారిపోయి ఉంటాయి-మనరూపాల్లోకూడా వచ్చేమార్పులకి ఒకరికొకరం పోల్చుకోలేక పోతాం,అందుకనే ఎవరికి వాళ్లం తెలియనట్టే ఉంటాం,గుర్తుపట్టలేక గమ్మున కొత్తగాబతికేస్తాం.మనకీ తెలియదు వాళ్ళకీ తెలియదుగా మరి- అంచేత!
అదేం వింతోగానిఈ కొత్త ప్రయాణంలో కలిసేవాళ్లలో కొంతమందిని కొద్దిగా లీలగా గుర్తుపడతాం (కొద్దిగా “మెమరీ బాక్ అప్” ఇస్తాడనుకుంటా భగవంతుడు) వాళ్ళు గుర్తుపట్టక పోయినా-వాళ్ళు అనుకోకుండా ఆత్మీయులై కూర్చుంటారు తమాషాగా- ఇప్పటిలాగే, ఎప్పుడూ అలాగే అవుతుంది అదేంటో మరి-ఎప్పటి లాగే!
మనప్రయాణం,ఇక్కడ బస ఎన్నాళ్ళో ఇతమిద్ధంగా ఎవరికీతెలియదు,ఈ అర్ధాంతపు,నిరంతరరాకపోకలవల్ల-వస్తూపోతూనే ఉంటాం నిరంతరం- “ఫ్రీక్వెంట్ ఫ్లయిర్ విజిటర్” లాగా. అంచేత ఏరోజూ వృధాచేయకుండా ప్రతీరోజూ,ప్రతీ నిమిషం ఆనందంగా కాలం గడిపేద్దాం.అప్పుడు అదాట్టుగా,ఉన్నట్టుండి “ఆఘ మేఘాల” మీద ప్రయాణం అయినా మనకు పెద్ద బాధ,గాబరా ఉండదు- అలవాటుపడి ఉంటాంగా అప్పటికే ఈ మేఘాలమీద ప్రయాణానికి!
ఇదిఒక్కటి భేషుగ్గా స్పృహలో పెట్టుకుంటే నిస్పృహే ఉండదు మనం స్పృహలో ఉన్నంతవరకు;అసలు చిక్కల్లా ఏమిటంటే మనందరికీ ఈ విషయం తెలుసు, ఎందుకో మరి గుర్తుకొచ్చినా మర్చిపోతుంటాం-అదేంటో మరి-భగవద్గీత చదివినా మన గీత సంగతి గుర్తుకురాదు- గీతాకారుడు సెలవిచ్చినట్టు బహుశా వ్యామోహాలవల్ల అనుకుంటా!!!
ఏదో వేదాంతం చెప్పాను అని అనుకోకండి-ఇది యుగయుగాలుగా జరుగుతున్న వాస్తవికత.మన నమ్మకాలతో-అపనమ్మకాలతో,మన నాస్తికత్వంతోగానీ ఆస్తికత్వంతోగానీ, బీద బీక్కీ అనిగానీ,ఇష్టాయిష్టాలతోగానీ ప్రమేయం లేదు, సంబంధమే లేదు-ఇది మాత్రం ఖాయం!
జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించి సంతోషంగా ఉందాం ఈఇంట్లో ఉన్నన్నాళ్లు!
ఏమంటారు- మీరు కాదనరనుకోండి నామాట!!
స్థితప్రజ్ఞత!!!
కొన్నాళ్లక్రితం నేనురాసిన ఒకవ్యాసంలో “స్థితప్రజ్ఞత” గురించి ప్రస్తావించాను, ఒకరిద్దరు హితులు స్థితప్రజ్ఞతగా ఎలా ఉండాలి అదికూడా రాస్తే బాగుంటుందికదా అని నాతో ప్రస్తావించటం జరిగింది!
ఈ విషయంలో నాకు తెలిసిన పరిధిలో చేసిన చిన్నప్రయత్నమే ఈ రాతలు!
మన ప్రవచన కర్తలు దీన్ని గురించి తరచూ వాళ్ళ ప్రసంగాల్లో చెప్తూనే ఉంటారు; ఇదీ కాకుండా భగవద్గీత ఏ మాత్రంకొద్దిగా చదివినా కూడా ఈపదానికి అర్ధం ఇట్టే తెలిసిపోతుంది,అది పెద్ద విషయంకాదు.పరిగణలోకి తీసుకోవాల్సింది ఏమిటంటే, స్థితప్రజ్ఞతగా జీవితంలో ఎలా ఉండగలగడం అని.
ఇది కొందరికి అదృష్టవశాత్తు, పూర్వజన్మసుకృతంవల్ల, మరికొందరికి సాధన చేయడంవలన ప్రాప్తిస్తుంది.అలా అని “అందరికి సాధ్యంకాదు అనికాదు, సాధ్యపడేదే”అనే శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు శ్రీమద్భగవద్గీతలో.దానికి ఎలాగ ఉండాలి అని కూడా,ఎలా సంప్రాప్తిసుంది అని కూడా విశదీకరించారు అందరికి అర్ధమయ్యేట్లు-ఇదేదో అర్జునుడికి చెప్పాడు కాబట్టి మనకు సంబంధంలేని విషయం అని అనుకోకుండా ఉంటే మన బుర్రలోకి కూడా ఎక్కుతుంది!!!
మామూలు పరిభాషలో అందరికి సులభంగా అర్ధం అవడానికి నాకుతెలిసిన కొంతమంది ఆప్తులు వాళ్ళవాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు,వాళ్ళ అనుభవాలు నాకు చెప్పినవి ఇక్కడ వివరిస్తాను-మీలో ఎవరికీవారే బేరీజు వేసుకోవచ్చు-మీరు ఏ స్థాయిలో వున్నారో!
ఇలా జీవితంలో ఉండగలగడమే స్థితప్రజ్ఞతే.మంచిఅయినా చెడుజరిగినా ఏమాత్రం మన మానసిక పరిస్థితిలో ఏమాత్రం తేడాలేకుండా ఉండటం!
రైల్ ప్రమాదం!!!మీరు రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నారు.మంచి గాఢనిద్రలో ఉండగా రైలు ఒక పక్కకి వొంగి నడుస్తున్న కుదుపుకి మీకు మెలకువ వచ్చింది.మెలకువవచ్చి చూసేసరికి మీరు పైబెర్తు మీదనుంచి కిందపడిఉన్నారు.రైలు కొద్దిదూరం అలాగే వెళ్తోంది.అప్పుడు మీ మనసులో బావాలు:
రైలు ప్రమాదం జరిగినట్టుంది కొన్ని సెకండ్లలో ఒరిగి పడిపోతుంది.ప్రాణంతోవుండే అవకాశమేలేదు.నా జీవితంలో ఇవి ఆఖరిఘడియలు,ఇది భగవంతుడి నిర్ణయం అనుకొని నిశ్చింతగా ఉన్నాను నిర్భయంగా ఏఆందోళనకి ఆవేదనకు లోనవకుండా .తల్లితండ్రులుగానీ,భార్యపిల్లలుగానీ, స్నేహితులుగాని, సన్నిహితులుగాని ఎవ్వరూ గుర్తుకురాలేదు, వాళ్ళమీద బెంగగాని అనిపించలేదు.అయ్యో అప్పుడే చనిపోబోతున్నానని చింత,కించిత్తు దుఖం కూడా రాలేదు!
రైలు ఆగడం, అందరం ఆ ప్రమాదంనుంచి బయటపడటం, కొందరు ప్రమాదంలో చనిపోవడం, చాలామంది ప్రమాదానికి గురికాకుండా అవడం-నాతోబాటుగా!! ఇక్కడ ప్రస్తావన ఇదికాదు.ఆ సందర్భంలో నామనసులో భావనలు ముఖ్యం!
ఏదో ఒకరోజు ఈజీవి నిర్జీవం అవడం ఖచ్చితంగనుక-ఈ భావనతో మనసా-వాచా కర్మణా నిత్యం జీవనం సాగిస్తూఉంటే ఇలా ఉండగలగడం చాలా సులువు!
వేరొక సంఘటన-ఇంకొకరి అనుభవం!!!
పిల్లలు పెద్దవాళ్ళయ్యాక కొంతమంది పైచదువులకు విదేశాలకు వెళతారు.అలాగే ఆ తల్లితండ్రులు,వారి ఒక్కగానొక్క అబ్బాయిని విదేశాలకు పంపడంలో తలమునకలై ఉన్నారు(అది వాళ్ళ అబ్బాయి కోరిక- విదేశాలకి వెళ్లడం….)
బోలెడు ప్రయత్నాలు, వ్యయప్రయాసలకి ఓర్చి అన్నిఏర్పాట్లు చేసారు.విదేశం వెళ్లేరోజు రానేవచ్చింది.ఒక వైపు ఆనందం,లోపల కొంత బెంగ-అందరికీ!ఆ అబ్బాయి వెళ్లేసమయంలో ఏ తండ్రి ఊహించని విధంగా ఈవిధంగా కొడుకుతో చెప్పాడు.
"నువ్వు నీ కోరిక మేరకు పైచదువులకు విదేశాలకు వెళ్తున్నావ్.అనుక్షణం ఇదే నీ ధ్యాసా,ధ్యేయంగా ఉండు.నువ్వు తిరిగిరావడానికి సమయం పడుతుంది.నీ వీలు ప్రకారం మాట్లాడుకుందాం-చదువుకి ఇబ్బంది లేకుండా.నువ్వు తిరిగి వచ్చేలోపు ఏ కబురైనా నువ్వు వినొచ్చు.ఏదైనా జరగొచ్చు,నేను లేను అనే కబురు కూడా రావొచ్చు.నువ్వు మాత్రం నీధ్యేయాన్ని మర్చిపోకు.నీ చదువుకు,ఇంట్లోవాళ్ళకి డబ్బు విషయంలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.మహాఅయితే భౌతికంగా చూడలేవు, కానీ, నీ జీవితాంతం నీతోడుగా నీవెన్నంటే ఉంటాను నీ జ్ఞాపకాలలో,ఏ విధంగా నువ్వు నన్ను కోల్పోతావు. నా తల్లితండ్రులు ఈ భూమిమీద లేకున్నా వాళ్లు నాతోనే ఉన్నారని భావిస్తూ జీవిస్తున్నవాణ్ణి- నా కొడుకువైనందుకు నీవుకూడా ఆ లక్షణాలు పుణికి పుచ్చుకున్నావు,ఇంక బెంగ దేనికి?ఆ మాటలకి అంత సంయమనంతోనూ ఆ కొడుకు విని తలఊపడం.
ఎంత పరిపక్వత ఆ తండ్రీకొడుకులకు- మరియు చావు పుట్టుకులమీద వారికున్న అవగాహన, అందునా వాళ్లకు అన్వయించుకోవడం -లేకపోతే అంత పరిణతితో మాట్లాడుకోగలరు!
నాకు తెలిసి ఇలాంటి సందర్భాల్లో – కొడుకైనా,కూతురైనా -తండ్రి సంభాషణలు ఎలా వుంటాయో మన అందరికి తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు ఇంకొక సంఘటన-వేరొకరి అనుభవం!!!
కూతురు స్నేహితురాలి తండ్రి మరణం!!!శ్మశానానికి వెళ్లడం!
ఒకరోజు పొద్దున్న మాఅమ్మాయి ఏడుస్తోంది,ఏమైందమ్మా అని అడిగితే నా ఫ్రెండ్ నాన్నగారు చనిపోయారట నిన్నరాత్రి అంది.తక్షణమే నామదిలో వచ్చిన భావం, అప్రయత్నంగా-“రేపు అదే స్థితిలో, నీ ఫ్రెండ్ లాగా-నువ్వు కూడా ఉండొచ్చు అనుకున్నా” మనసులోనే నవ్వుకుంటూ!
నా భావనలో నుంచి క్షణంలో బయటపడ్డా,వెళ్లి ఫ్రెండ్ని చూడాలని ఉంది అంది.ఇద్దరి ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదుట అంది.నేను తీసుకెళ్తా అన్నాను.నేను రెడి అయ్యేలోపుల “నాన్నా, ఇంకో ఫ్రెండ్ వస్తానంది, మేమిద్దరమూ అక్కడకి వెళతాం అంది”.అలాగే అని “మీ ఫ్రెండ్ ని ఓదార్చి రండి, కాస్సేపు కావాలంటే ఉండిరా” అన్నాను.
మా అమ్మాయి ఆలోచన,తాను పడ్డబాధ -తన ఫ్రెండ్ గురించి- నన్ను కలచివేసింది.ఆ వయసులో ఆ భావన వచ్చినందుకు నేను సంతోషించా.అలాగే ఎవరు పోయారని తెలిసినా నన్ను నేను ఆ పరిస్థితిలో ఊహించుకుంటా-బతకాలని కోరిక లేకపోవడం కాదు, బతుకుకి అర్ధం తెలిసి బతకడం నాప్రకారం!
వాళ్ళ అనుభవాలు కాకుండా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తా.మీలో ఎవరికీ వారే బేరీజు వేసుకోవచ్చు- మీరు ఏ స్థాయిలో ఉన్నారో!!!
చాప మీద పడుకోగలగడం!!!
జీవితంలో పార్థివదేహాన్ని చాపమీద ఉంచుతారు,చాపమీద పడుకున్న ప్రతీసారి ఆ ఆలోచన వచ్చినా నిర్భయంగా పడుకోగలగాలి-అదే స్థిత ప్రజ్ఞత.
కించిత్తు ఆలోచన,సంశయం లేకుండా అవతల వాళ్లకి సహాయం చేయడం!!!
బయట వాళ్లని సొంతవాళ్ళలాగా చూడటం,డబ్బు అనేది సొంతవాళ్లకి ఎలా ఖర్చుపెడతామో అలాగే అవతలవాళ్లకి కూడా చేయడం ! వాళ్లకు ఇబ్బంది వచ్చి మీ దగ్గరకు వస్తే,తల తాకట్టుపెట్టి అవతలవాళ్లకి సహాయం చేయగలగడం ప్రాణం వదిలిన పార్థివదేహాన్ని చూసినప్పుడల్లా,మనదేహం కూడా ఏదో ఒకరోజు దీనికి లోనవుతుందనే భావన అనాయచితంగా రాగలగడం!!!
కనీస అవసరాలతో జీవించడం,డబ్బు ఇంకా కూడపెట్టాలి అనే భావన లేకుండా ఉండటం!! ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటామనే భావన తప్ప,ముసలితనంలో అనారోగ్యంతో ఉంటామేమో అని ముందే ఊహించేసుకోకుండా ఉండగలగటం!!! ముందుగా ఆర్ధికవనరులు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం, అంత వరకే!!!
అంతేకానీ దానికోసం పదేపదే ఆలోచించడం అవివేకం,వెంపర్లాడాటం అనారోగ్యకరం!
జీవితం అనే పదాన్ని ఎంత తరచుగా నిర్భయంగా వాడతారో చావు అనే పదాన్ని అంత తేలిగ్గా వాడగలుగుతారా!
జీవితం చివరివరకూ ఉంటానికి గూడు,నోటికి కూడు, సామాన్యంగా బతకటానికి కావాల్సిన డబ్బు ఉంటే చాలు.ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులని నేను చూడటం తటస్తించింది నా జీవితంలో అదృష్ట వశాత్తు అందునా పరిచయం వున్నవాళ్లలో. వీళ్ళు నిజమైన స్థితప్రజ్ఞులు-సత్కర్మలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తారు!
ఎంత పరిపక్వత ఆ తండ్రీకొడుకులకు- మరియు చావు పుట్టుకులమీద వారికున్న అవగాహన, అందునా వాళ్లకు అన్వయించుకోవడం -లేకపోతే అంత పరిణతితో మాట్లాడుకోగలరు!
నాకు తెలిసి ఇలాంటి సందర్భాల్లో – కొడుకైనా,కూతురైనా -తండ్రి సంభాషణలు ఎలా వుంటాయో మన అందరికి తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు ఇంకొక సంఘటన-వేరొకరి అనుభవం!!!
కూతురు స్నేహితురాలి తండ్రి మరణం!!!శ్మశానానికి వెళ్లడం!
ఒకరోజు పొద్దున్న మాఅమ్మాయి ఏడుస్తోంది,ఏమైందమ్మా అని అడిగితే నా ఫ్రెండ్ నాన్నగారు చనిపోయారట నిన్నరాత్రి అంది.తక్షణమే నామదిలో వచ్చిన భావం, అప్రయత్నంగా-“రేపు అదే స్థితిలో, నీ ఫ్రెండ్ లాగా-నువ్వు కూడా ఉండొచ్చు అనుకున్నా” మనసులోనే నవ్వుకుంటూ!
నా భావనలో నుంచి క్షణంలో బయటపడ్డా,వెళ్లి ఫ్రెండ్ని చూడాలని ఉంది అంది.ఇద్దరి ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదుట అంది.నేను తీసుకెళ్తా అన్నాను.నేను రెడి అయ్యేలోపుల “నాన్నా, ఇంకో ఫ్రెండ్ వస్తానంది, మేమిద్దరమూ అక్కడకి వెళతాం అంది”.అలాగే అని “మీ ఫ్రెండ్ ని ఓదార్చి రండి, కాస్సేపు కావాలంటే ఉండిరా” అన్నాను.
మా అమ్మాయి ఆలోచన,తాను పడ్డబాధ -తన ఫ్రెండ్ గురించి- నన్ను కలచివేసింది.ఆ వయసులో ఆ భావన వచ్చినందుకు నేను సంతోషించా.అలాగే ఎవరు పోయారని తెలిసినా నన్ను నేను ఆ పరిస్థితిలో ఊహించుకుంటా-బతకాలని కోరిక లేకపోవడం కాదు, బతుకుకి అర్ధం తెలిసి బతకడం నాప్రకారం!
వాళ్ళ అనుభవాలు కాకుండా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తా.మీలో ఎవరికీ వారే బేరీజు వేసుకోవచ్చు- మీరు ఏ స్థాయిలో ఉన్నారో!!!
చాప మీద పడుకోగలగడం!!!
జీవితంలో పార్థివదేహాన్ని చాపమీద ఉంచుతారు,చాపమీద పడుకున్న ప్రతీసారి ఆ ఆలోచన వచ్చినా నిర్భయంగా పడుకోగలగాలి-అదే స్థిత ప్రజ్ఞత.
కించిత్తు ఆలోచన,సంశయం లేకుండా అవతల వాళ్లకి సహాయం చేయడం!!!
బయట వాళ్లని సొంతవాళ్ళలాగా చూడటం,డబ్బు అనేది సొంతవాళ్లకి ఎలా ఖర్చుపెడతామో అలాగే అవతలవాళ్లకి కూడా చేయడం ! వాళ్లకు ఇబ్బంది వచ్చి మీ దగ్గరకు వస్తే,తల తాకట్టుపెట్టి అవతలవాళ్లకి సహాయం చేయగలగడం ప్రాణం వదిలిన పార్థివదేహాన్ని చూసినప్పుడల్లా,మనదేహం కూడా ఏదో ఒకరోజు దీనికి లోనవుతుందనే భావన అనాయచితంగా రాగలగడం!!!
కనీస అవసరాలతో జీవించడం,డబ్బు ఇంకా కూడపెట్టాలి అనే భావన లేకుండా ఉండటం!! ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటామనే భావన తప్ప,ముసలితనంలో అనారోగ్యంతో ఉంటామేమో అని ముందే ఊహించేసుకోకుండా ఉండగలగటం!!! ముందుగా ఆర్ధికవనరులు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం, అంత వరకే!!!
అంతేకానీ దానికోసం పదేపదే ఆలోచించడం అవివేకం,వెంపర్లాడాటం అనారోగ్యకరం!
జీవితం అనే పదాన్ని ఎంత తరచుగా నిర్భయంగా వాడతారో చావు అనే పదాన్ని అంత తేలిగ్గా వాడగలుగుతారా!
జీవితం చివరివరకూ ఉంటానికి గూడు,నోటికి కూడు, సామాన్యంగా బతకటానికి కావాల్సిన డబ్బు ఉంటే చాలు.ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులని నేను చూడటం తటస్తించింది నా జీవితంలో అదృష్ట వశాత్తు అందునా పరిచయం వున్నవాళ్లలో. వీళ్ళు నిజమైన స్థితప్రజ్ఞులు-సత్కర్మలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తారు!
మీలో అన్ని లక్షణాలు ఉంటే మీరు తప్పకుండా సంతోషకరమైన జీవితం సాగిస్తున్నవారే, స్థితప్రజ్ఞతతో మీ మానవ జన్మసార్ధకం అయినట్ట్టే.అందులోని కొన్ని లక్షణాలున్న మీరు ఆదశగా సన్మార్గంలో ఉన్నట్టు లెక్కే,మీరు మంచిహృదయంతో జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు!!!
ఆత్మ ఘోష
ఇది మనిషి బతికిఉండగా మన శరీరంలోనుంచి ఆత్మచేసే ఆవేదన,మన జీవితంలోఎంచుకున్న మార్గం సక్రమంగా లేనప్పుడు.మనం దాన్ని చేవినేపెట్టం, మన శరీరం, మన పంచేంద్రియాలు- మెదడుఆధీనానికి వొదిలేసామ్ కాబట్టి.
ఆ ఘోష మనం లెక్క చేయం సర్వసాధారణంగా;ఊబిలోకి వెళ్లే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆఘోష ఇంకాబాగా, జోరుగా వినపడుతుంది. “నేను నీకు చెపుతూనే ఉన్నా, కానీ నువ్వే నన్నులక్ష్యపెట్టక నీమెదడు చెప్పిన మాటలే మెదడుకి ఎక్కించుకున్నావు” అని ఆత్మ మెల్లిగా చెబుతుంది,ఘోషతో కాకుండా.
కొంతమందికి ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞానోదయం అవుతుంది.అప్పుడు ఆత్మ తన పరిధిలో తనకున్నఅవకాశంమేరకు ఆ స్థితినుండి గట్టెక్కించడానికి ప్రయత్నిస్తుంది- ఎంతైనా మన ఆత్మ,అందునా ఈశరీరాన్ని వాడుకుంటుంది తన కర్మలకు!
ఈస్థితి గ్రహించి మిగిలిన జీవితాన్ని చక్కగా నడిపేవాడే కాలక్రమేణా స్థితప్రజ్ఞుడు అవడానికి బోలెడు అవకాశం.భగవంతుడు ప్రతీమనిషికి అనేక సంఘటనల ద్వారా ఈ దారి చూపించడానికి సర్వదా ప్రయత్నిస్తూనే ఉంటాడు,నిర్విరామంగా.దీని లోతుల్లోకి వెళ్లడం అనేది పూర్తిగా వ్యక్తిగతం, ఎందుకంటే ఆసక్తి ఉండాలి కాబట్టి.
ఉనికి
జీవితంలో చిన్నచిన్న ప్రలోభాలకి, వ్యామోహాలకి దాసుడివి అయితే శాస్త్రాలు వేదాలు,గ్రంధాలు చదివినా,ఎంత జ్ఞానంఉన్నా నిష్ప్రయోజనమే,నిష్ఫలమే- నీ మనసునీ, స్వల్పకాలపు నీఉనికిని తెలుసుకోకపోతే ఈ అవకాశం వృధాఅయినట్టే ఈ మానవజన్మకి- బూడిదలో పోసినపన్నీరులాగా-అదే ప్రారబ్దకర్మ!
మనిషి తన జీవితంలో తన ఉనికిని తెలియచెప్పడానికి తెగ పాటుపడతాడు.కానీ తన ఈఉనికి అతి స్వల్పకాలమే అని గ్రహించేలోపే తన ఉనికి కాలగర్భంలో కలిసిపోతుంది.ఇది గ్రహించక తనకు ఉన్న సమయం చాలాఉందని,సమయం తన చేతుల్లోనే ఉందనే భ్రమలో బతికేస్తాడు.తన ఉనికికి కారకుడైనది ఎవరు అనిగానీ,అసలు తనకు ఈ ఉనికిని ఎందుకు ఇచ్చాడు అనిగానీ ఆలోచనే తట్టదు.
మనిషిజన్మ దొరకడమే దుర్లభం,అలా అని ప్రతీమనిషికి ఈ జీవితంలో అన్నీ సమకూరవు- కొందరికే అన్నీదొరికేది.అందునా చక్కటి కుటుంబ నేపధ్యం, సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యం,సదాలోచన,ధార్మికత చాలా అరుదుగా దొరుకుతుంది పూర్వజన్మ సుకృతం వల్ల-కొద్దిమందికి మాత్రమే.
ఇవి ఉండికూడా ఇంకా వ్యామోహాల్లో బతికేవాళ్ళని చూసి భగవంతుడు నవ్వుకుంటాడు వాళ్ళ లోపలనుంచే, పైనుంచి కాదు-ఇంత విజ్ఞానం,స్పృహ ఉండికూడా ఈ మానవజన్మని వృధా చేసుకున్నందుకు!
మన కళ్ళముందే ఆప్తులు,తాత ముత్తాతలు,స్నేహితులు,తల్లి తండ్రులు కాలగర్భంలో కలసిపోవడం వీక్షిస్తూ కూడా తానుమాత్రం చిరంతరం చిరంజీవిలాగా ఇక్కడే ఉంటానని అనుకోవడం మూర్ఖత్వం కాదా; భగవద్గీత, వేదాలు శాస్త్రాలు, రామాయణ మహాభారతాలు,భాగవతాలు చదివి-తెలిసినా నిష్ఫలమే!ప్రతీసారీ నీ ఉనికి, గుర్తింపుకోసం బతకకు,నీ తృప్తి, సంతోషంకోసం బతకాలని గ్రహించు.గుర్తింపు కోసమే అయితే జీవితంలో తృప్తి,సుఖ- శాంతులు ఉండవు.
నీ ఉనికిని వృధా చేయకు!
దరిద్రం- దరిద్రుడు!!!
దరిద్రుని దగ్గర పసిడి ఉండకపోవచ్చు కానీ,సుఖంగా,ఆనందంగా జీవించవచ్చు.
కానీ,బంగారం ఉన్నా దరిద్రంగా బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈలోకంలో. “దరిద్రం” అనేది మనిషి బౌతికంగా అందరికీ కనపడే, నివసించే స్థితి, స్థాయినిబట్టి వాడే పదం .కొంతమంది ఆస్థితిలో కూడా తృప్తిగా సంతోషంగా ఉండేవారు మనకు అప్పుడప్పుడు తారసపడతారు-మనసుతో చూడగలిగితే-అప్పుడు వీళ్ళని దరిద్రులు అని అనగలమా!
ఇలాకాకుండా అన్నీఉండి కూడా మానసికంగా దరిద్రంగా బతికేవాళ్లు చాలామంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో, “దరిద్రం” అనేది జనబాహుళ్యంలో విస్తృతంగా వాడేది- ఇతరులు నివిసించే స్థితినిబట్టి-మానసికంగా అనేది ప్రపంచానికి తట్టదు, బౌతికమే కనపడుతుంది కాబట్టి! బౌతికంగా బతికే దరిద్రుడే మిన్న మానసిక దరిద్రుని కన్న!!!
అసలు నిజమైన దరిద్రులు ఎవరు...
ఆలోచనచేసి “అన్వేషణ” మొదలుపెడితే సమాధానం మనకే దొరుకుతుంది; సమాధానం దొరికిన తరువాతకూడా మారనివాళ్లని వాళ్ళ మానాన,వాళ్ళ కర్మ అనుకుని వదిలేసి మన జీవితప్రయాణం కొనసాగిద్దాం.ప్రయాణం చివరి మజిలీలో మాత్రం ఒంటరిగానే-మధ్యలో వచ్చిన ఏతోడూ మన చివరివరకు రాదు.ఆ వివేకంతో ఆనందంగా శేషజీవితాన్నైనా బతకడం నేర్చుకుందాం!!!
“ఆధ్యాత్మిక బాగస్వామ్యం”అంటే ఏమిటి!
“ఆధ్యాత్మికత” అనేపదం తెలియని భారతీయుడు ఉండడు-దాని భావం తెలియక పోవచ్చుకాని;సత్యయుగంలో,ఆధ్యాత్మికత అనేది ప్రతీవారి జీవనస్రవంతిలో భాగంగా ఉండేది.
త్రేతాయుగం,ద్వాపరయుగాలలో అవతారపురుషులు నడయాడిన కాలాలు అవి. ఆందరూ ధర్మం,నీతితప్పక సుఖశాంతులతో జీవించేవారు.సత్సంగాలు,ధర్మ బొధలూ అనేవి సర్వసాధారణం.కొద్దిగా మెట్టు కిందికిదిగి కొందరు బాహ్యసుఖాలకు భోగాలకు లాలసులయినారు.కాని వీరిశాతం పెద్దగా లెక్కలోనికి రాదు.
“ఆధ్యాత్మికత” అనేది ఆనాటి జీవనవ్యవస్థలో సమ్మిళతమై ఉండేది,కలిప్రవేశంతో కలుషితమయిన ఈ కలికాలంలో ఆధ్యాత్మికత అనేది ప్రజల్లో చాలావరకు కొరవడింది.
అయినా దాని భావం, దాన్నిలోతుగా అధ్యయనం చేసినవాళ్ళు,లోతుగా అధ్యయనం చేస్తున్నవాళ్ళు,అలాజీవించే వారి శాతంకూడా రెండో,మూడో దశాబ్దాల క్రితంవరకు ఉండేది.ఆధ్యాత్మికత చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్లు ఉండేవారు, ధర్మబోధలు చేసేవాళ్ళు- సమాజంలో మెండుగా ఉండేవారు.ఏ గురువు దగ్గరో కాస్త దాని అర్ధం పరమార్ధం,మార్గం తెలుసుకొని తమవంతు ప్రయత్నాలు చేసి కృతకృత్యులు అయ్యేవారు.ఈ “ప్రపంచీకరణ” వచ్చిన తర్వాత బౌతిక ప్రపంచానికి, సుఖాలకి,భోగలాలసకి ప్రజలు మక్కువ చూపి, అటుమొగ్గి వీటికి బాగా అలవాటుపడ్డారు.
సంపదలు పెరిగాయి,వాటితో పాటు కొరికలూ కొండవీటి చాంతాడంత అయ్యాయి మానవసంబంధాలు క్షీణించాయి.కేంద్రీకృత కుటుంబాలు(న్యూక్లీయస్ ఫ్యామిలిస్) పెరిగాయి,పెద్దవాళ్లు ఉండే ఇళ్లే నూటికో కోటికో ఒకటయ్యాయి.ఒక వేళ ఉన్నా పెద్దవాళ్ళ మాటల్ని చాదస్తంగా కొట్టేస్తున్నారు- ప్రతీదానికి తర్కానికి దిగుతూ.
మన సనాతన ధర్మంలో ఎక్కడా “ఆధ్యాత్మిక బాగస్వామ్యం” అనే పదమే లేదు, ఇది పూర్తిగా ప్రాక్ పశ్చిమదేశాలలో పుట్టింది,ఆయాదేశాల్లో భౌతికవాద సిద్ధాంతం (మెటీరియలిస్టిక్ సిద్ధాంతం) జనజీవననాడిలో ఉండేది.అసలు ఆధ్యాత్మికత అనే పదాన్ని వాళ్ళు మన సనాతనధర్మం నుంచే గ్రహించి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం.ఆ రోజుల్లో ప్రపంచీకరణ(గ్లోబలైజేషన్)అంత ప్రాచుర్యంలో లేక పోయినా, మన సనాతనధర్మానికి ఆకర్షితులయిన వాళ్ళు చాలామంది విదేశీయులలో ఉన్నారు- మనం చాలా తార్కాణాలు చూస్తున్నాం కూడా!
ఆ రోజుల్లో మాతరం వాళ్లలో కొంతమందికి గుర్తుండి ఉంటుంది,రజనీష్ ఆశ్రమం పూణేలో ఉండేది.అందులో విదేశీయులే ఎక్కువ ఉండేవారు.ఈ “స్పిరిచువల్ పార్టనర్ షిప్” అనే కాన్సెప్ట్ తో, చాలామంది విచ్చలవిడి జీవితాన్నిస్వేచ్ఛగా,
యథేచ్ఛగా,విశృంఖలంగా కూడా అనుభవించేవాళ్ళు.ఆయన ఈ ఫిలాసఫీని బాగా ప్రచారంచేశారు.ఆ ప్రభావంతో కొంతమంది మనవాళ్ళు కూడా దానికి మరిగారు.నా ఉద్దేశం ప్రకారం ఇది మంచి ఉదాహరణ, “ఆధ్యాత్మిక భాగస్వామ్యానికి”
ఈరోజుల్లో కూడా మనం కొంతమంది దొంగగురువుల్ని చూస్తున్నాం మన సమాజంలో.ఆధ్యాత్మికత ముసుగులో ప్రజల జీవితాలతో, అబలలతో ఎలా ఆడుకుంటున్నారో.అసలు ఈరోజుల్లోకూడా ఆధ్యాత్మిక భాగస్వామ్యం అవసరం ఏముంది,ఎవరికైనా కావాల్సింది “మార్గదర్శకత్వం” ఒకటే. ఒక్కసారి ఈదారి తెలుసుకున్న తర్వాత మనమే ఆదారిని రహదారిగా మార్చుకొని మన ప్రయాణం కొనసాగించవచ్చు,అవసరపడితే అప్పుడప్పుడు సత్సంగాలకి వెళ్లొచ్చు.
ఇది విదేశాల్లో ఎప్పటినుంచో ప్రాచుర్యం పొందింది,వారి సమాజం, అలవాట్లు, కట్టుబాట్లు, సంస్కృతి,పూర్తిగా భిన్నం మనదేశానికి.దానికి కాస్త విసుగుచెంది మార్పుకు చూసేవారు దీనికి ఆకర్షితులు అయ్యారు.అలాఅని అందరూ పైనచెప్పిన విధంగా ఉంటారని నా ఉద్దేశంకాదు.రజనీష్ ఆశ్రమం మూతపడ్డ తర్వాత,ఆయన పోయిన తర్వాత ఈ ఫిలాసఫీ పూర్తిగా తెరమరుగయ్యింది మన దేశంలో.
అదృష్టవశాత్తు ఈమాట పూర్తిగా మటుమాయమైపోయింది,దురదృష్ట వశాత్తు ఈ ప్రపంచీకరణవల్ల యువతరంలో కొద్దిమంది మళ్ళీ దీనిగురించి మాట్లాడు తున్నారు,భవిష్యత్తు లో ఆకర్షణకు గురిఅయినా ఆశ్చర్యంలేదు.దానికి ముఖ్యకారణం మారిన జీవనవిధానం,ఆహారపు అలవాట్లు,సంస్కృతి, ఇళ్లలో పెద్దతరంవాళ్ళు లేకపోవడం, మంచీచెడు చెప్పే తీరుబడి తల్లిదండ్రులకు లేకపోవడం,ఉన్నా శ్రద్ధపెట్టకపోవడం.
ఒక విధంగా మనకళ్ళు మనమే పొడుచుకుంటున్నాం, అయినాకూడా ఈ సంగతే పట్టనట్టు ఉంటున్నాం “చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు” అనే నానుడిని చదివి, అవగాహన చేసుకొని జీవించిన తరంవాళ్లు ఈతల్లితండ్రులు.వాళ్ళవరకు వచ్చేసరికిఈ సామెత వారు అన్వయించుకోలేక నిస్సహాయస్థితిలో పడిఉంటారు-ఈ నవతరం,యువతరంలో కొందరి ప్రవర్తనకి.
కొంతమంది “మన చేతులో ఏముంది,వాళ్ళ కర్మ ప్రకారం జరుగుతుంది” అనే “మెట్టవేదాంతంతో” బతికేస్తూ ఉన్నారు.ఏది ఏమైనా, ఈ ఆలోచన ఏ జాతికి శ్రేయస్కరం కాదు,యువతరం నిర్వీర్యం అవకూడదు “స్వామి వివేకానంద” చెప్పినట్టు!!
ఇప్పటికైనా యువతరంమేలుకుంటే వారికీ,జాతికీ మేలు!!
మాతృక!!!
మాతృకకు-నకలుకూ పోలికేలేదు,తటాలున చూడటానికి ఒకే పొలికతో ఉండవచ్చు కానీ,కొద్దిసమయంలోనే నకలుయొక్క అసలు స్వరూపం బయటపడుతుంది.
మాతృక అనే పదం“మాతృ” నుంచి వచ్చింది,మాతృ అనగా తల్లి; మరొకరితో పోలిక ఉంటుందా? భగవంతుడికి వేరొకరితో పోలికలేనట్లే!
నకలు వస్తువులకు, నకలు మనుషులకు కోదవేలేని ప్రపంచంలో జీవిస్తున్నాం మనం ఈరోజున.జీవితంలో మానవుడికి కావలసింది సహనం, నేర్పు -నిజానిజాలు తెలుసు కోడానికి- మాతృకకు, నకలుకూ మద్య!
ప్రతీ మనిషి మాతృకగా బతకాలి నకలుగా కాదు!!!!
ధర్మం-పాదాలు!!!
“సత్యయుగంలో” ధర్మానికున్నవి నాలుగు పాదాలు!
“త్రేతాయుగంలో” మూడు పాదాలయినాయి!
“ద్వాపరయుగంలో” రెండు పాదాలయినాయి!
ఆ రెండు పాదాలు “కలియుగం” వచ్చేసరికి, ఒకపాదం కోల్పోయి మరొక్కపాదమే మిగిలి ఆ ఒక్కపాదంతో నడుస్తున్న సంగతి అందరికీ తెలుసు!
ఈ కలియుగంలో "సత్య యుగాన్ని"ఊహించే సాహసం చేయలేం కనుక-రెండో పాదానికైనా సమిష్టిగా మానవులందరూ ప్రయత్నం చెయ్యవచ్చు. ఎవరికివారు వారి నిత్యజీవితంలో కొంతస్వార్ధం వొదులుకొని తోటివారికి సహాయంచేసే పనిని కొద్ది మోతాదు పెంచాలి.మనం చేసే ప్రతి మంచిపనిని పెద్దమోతాదులో పెంచితే ధర్మంయొక్క రెండవపాదం బాగుపడుతుంది.
రోగంవచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఆరోగ్యవంతులం అవ్వాలంటే మంచి మందులు తీసుకుంటాం.అలాగే, మనంచేసే మంచిపనులు-అందరం పెద్దమోతాదులో పెంచితే ధర్మానికి ఆరోగ్యం కొద్దిగా కుదుటపడి రెండవకాలు బాగుపడుతుంది.
దేశంలో ఇంత తీవ్రపరిస్థితులు ఉన్న సమయంలో మనందరం మన నాయకుని మాట వింటున్నాంగా -పరిస్థితులు పూర్వపు స్థితికి రావడానికి,మెరుగు పడటానికి.
ఈ సందర్భంలో వచ్చిన అనుభవంతో మనలో ఖచ్చితమైన మంచిమార్పు రావాలి,ఈమార్పువల్ల మానవాళి అంతా సుఖపడుతుంది.
ఆవేదనలు,అన్యాయాలు, అక్రమాలు, స్వార్థం తగ్గాలి.మనలో వచ్చిన ఇంత మంచిమార్పుకి పడిపోయిన ధర్మాన్ని నిలబెట్టినవాళ్లం అవుతాం-ప్రకృతి కూడా శాంతించి మళ్లీ పులకరిస్తుంది!
తలో చెయ్యివేద్దాం,ఆరంభం మన ఇంటినుంచి రావాలి,ఎదుటవారినుంచి కాదు.నేనూ ఆశాజీవినే- చాలామంది లాగా!ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నా-ఆశావహదృక్పథంతో!!!
"సంకల్పబలాన్ని" మించింది లేదు.భగీరథుడు దివినుండి భువికి "గంగని" తేలేదా!
“బీజం- క్షేత్రం”!!!
బీజానికి క్షేత్రం కావాలి, అది నాటుకొని,వేళ్లూని బతికి ఎదుగుతుంది,తన ఉనికిని నిలబెట్టుకొని ఒదుగుతూ ఎదుగుతుంది.ఇవి అన్నీ,అది పడ్డ క్షేత్రాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది.ఆ తర్వాత, చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రజలూ, సమాజం వాటిని సాకే విధానం,సంరక్షణ కూడా వాటి ఎదుగుదలకి దోహదకారులు అవుతారు.
దీన్నిబట్టి అవగాహన చేసుకోవాల్సింది చాలాఉంది-బీజానికి, క్షేత్రానికి అవినాభావ, అవిభాజ్య సంబంధం ఉందని, పరిసరాల ప్రభావం, తోడూ కూడా వాటిని ప్రభావితం చేస్తాయని!
ప్రతీ మనిషికి ముఖ్య మైనది కూడా బీజమూ,క్షేత్రమే. “బీజమే తండ్రి, క్షేత్రమే తల్లి” ఈ రెండూ ఏ మానవుడి చేతిలోలేవు- కోరుకోడానికి-అది మన పూర్వజన్మ కర్మలఫలాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.అయినాకానీ మన పరిసరాలు, కూడా ప్రభావితం చేస్తాయి- పై ఉదాహరణలాగా!
మంచి తల్లితండ్రులకు పుట్టడం ఒక ఎత్తు,మనం పెరిగే విధానం,ఆకళింపు చేసుకోవడం, మనల్ని మనం సక్రమంగా మలుచు కోవడం పూర్తిగా మనమీద ఆధారపడి ఉంటుంది. ఎవ్వరూ కారకులు కాదు- తప్పుడుదోవ పట్టినా,మంచినే ఆలంబనగా చేసుకున్నా!
ఒక తల్లితండ్రులకు పుట్టిన బిడ్డలందరూ ఒకే రకంగా ఉండరు.కొన్ని సారూప్యాలున్నా,విభేధాలు కూడా ఉంటాయి. కానీ మంచిగుణాలు అలవరచుకోవడం మాత్రం వ్యక్తిగతం, వాళ్ళ అభిలాషమీద ఆధారపడి ఉంటుంది.అందుకే సమాజంలో మనకు చాలామంది తారస పడుతుంటారు ఒకేకుటుంబంలో మంచీ-చెడు ఉన్నవారు!!!
మొదట దృష్టాంతం-మీరు మంచి బీజమూ,క్షేత్రాన్నించి వచ్చిఉంటే మీరు అదృష్టవంతులు అని.దాన్ని సార్ధకత చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా, నిస్సంకోచంగా మీదే!!!
మన పరిస్థితులకి ఇతరులను నిందించడం,సాకుగా చూపించడంమానేయండి, ఆత్మపరిశోధన చేసుకుంటే జీవితతత్వం బోధపడుతుంది,మన మనస్సాక్షే మనకు ప్రతిబింబం-మనల్ని మనం మోసం చేసుకోవడం ఎంత త్వరగా మానేస్తే అంత తొందరగా ఈ ఊబిలోంచి బయటపడతాం.
అన్ని పనులు సక్రమంగా చెయ్యడమే పరిపూర్ణత కాదు జీవితంలో!!!
ప్రతీపనీ సక్రమంగా చెయ్యాలనుకోవడం తప్పుకాదు,బహు కొద్దిమందే అలాగుంటారు;ఆది వారి అలవాటే కాదు,స్వభావం,అభిరుచి వారి జీవితంలో. ఈ స్వభావం ఉన్నవారిని చూసి,వీళ్లంతా వారివారి జీవితాల్లో ఎంతో కోల్పోతున్నారని ఇతరుల భావనగా ఉంటుంది.
కానీ, వీళ్లకి అలా అనిపించదు సరికదా, ఆందరూ ఎందుకు తమలాగా ఉండరు అని అనుకుంటారు- ఏంచేతంటే వీరు సర్వకాలసర్వావస్థలలో వారు చేసే ప్రతీపనీ సక్రమంగానూ,పరిపూర్ణంగానూ చేస్తుంటారు కనుక వారికి వేరే ఆసక్తి ఉండదు- జీవితంలో!
తెలివి వచ్చి,తెలుసుకొనే సమయానికి బ్రతుకు చరమాంకంలో ఉంటారు. అప్పుడు జీవితాన్ని ఆస్వాదిద్దామంటే సమయం ఉండదు.భగవంతుడు మానవజన్మ ఇచ్చింది అన్నీ సక్రమంగా చెయ్యటానికే కాదు- బ్రతుకుని పరిపూర్ణంగా గడపడానికి!
ఇంకొంతమంది ఉంటారు-నమూనాకు!!!
జీవితంలో అన్నీఉండి కూడా చిన్నచిన్న వాటిని మనసులోని భూతద్దంలోంచి చూసి,చీటికీ మాటికీ చిరాకుపడటం,ఉన్న మనుష్యుల మధ్య ఉండే మానవసంబంధాల కంటే వీటికి ప్రాముఖ్యత ఇవ్వడం విపరీత మనస్తత్వాలు అనడంలో ఏ మాత్రం సంకోచన అక్కర్లా.ఏమీ కొరతలేకుండా,జీవితాలు సుఖంగా సాఫీగా సాగుతుంటే ఈ“సాగతీత” ఎందుకో మరి!!! సుఖంగా బతకడం చేతకాకపోవడం అంటే ఇది కాదా మరి-అహంకారం అడ్డం వచ్చినా,ఉక్రోషంగా ఉన్నా ఎంత తొందరగా తెలుసుకొని మారడం వివేకవంతుల, చదువుకున్నవాళ్ళ లక్షణం. చదివిన ప్రతివానికి వివేకం ఉండదు,అలాగే వివేకం ఉన్న ప్రతీవాళ్ళు చదువులు చదివి ఉండకపోవచ్చు.చదువుతో వివేకం వస్తుందని, సంతోషంగా బతకగలరని ఎక్కడా హామీ (గ్యారంటీ)లేదు.ఎందుకంటే సంతోషం ఇచ్చేది మన మనసు,మన స్వభావం!!!
వీళ్ళందరూ ఎంత తొందరగా తెలుసుకుంటే కొంత ఆనందాన్నన్నా మిగిలిన జీవితంలో అనుభవించగలరు! ఆపై వారి ఇష్టం,అభీష్టం-వారిజీవితం వారి ఇష్టం మనమెవరం ఆంక్షపెట్టడానికి, ఆకాంక్షించడానికి?
అందరికీ ఉండేది రోజుకు ఇరవైనాలుగు గంటలే,విజ్ఞులు, వివేకవంతులు ప్రణాళికాబద్ధంగా,సంతోషంగా,జీవితాన్నిపరిపూర్ణంగా జీవించగలుగుతారు.
ధనలక్ష్మి మాత్రమే కాదు లక్ష్మీదేవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు.సాధారణంగా దేవాలయాల్లో లక్ష్మీదేవిని ధనలక్ష్మి రూపంతో చూపుతారు,భక్తులు కూడా అలాగే మనసులో అనుకొని దర్శనం చేసుకుంటారు.
అష్టలక్ష్మీదేవి ఆలయాలకు వెళ్తే మాత్రమే అష్టలక్ష్ములను చూస్తాం, అప్పుడు కూడా ధనలక్ష్మి వద్ద కొద్దిగా ఎక్కువసేపు,గట్టిగా దండం పెడతాం,మనసులో ఎక్కువ ఆశీర్వాదాలు కాంక్షిస్తాం.మిగతా లక్ష్మీదేవి అంశలను చూసి,ఆశీర్వదాలు కోరుకుంటాం.
అష్టలక్ష్ములు తెలియనివాళ్లు కూడా ఉండచ్చు ఈ రోజుల్లో, ఆ వివరాలు :
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి!
అష్టలక్ష్ములు- శ్రీమహాలక్ష్మి అంశలే,సిరిసంపదలు మాత్రమే ధనలక్ష్మినుండి కోరకండి, పైన అంశలలో ఉన్న అన్నింటి కటాక్షం కావాలి ప్రతీ ఒక్కరికీ, అష్టఐశ్వర్యాలతోబాటు మిగిలిన అంశలయొక్క ఆశీర్వాదం కోరుకోండి; అష్టలక్ష్ములు అన్నీ ఇష్టలక్ష్ములుగా చేసుకోండి-ధనలక్ష్మి మాత్రమే కాదు; ఒక్క ధనంతోనే జీవితంలో అన్నీసాధించలేము-అది మరువద్దు!
అంతర్ముఖం!!!
మనస్సు ఎప్పుడు బాహ్య ప్రపంచంలో విహరిద్దామని ఉవ్విళ్లూరుతూ ఉంటుంది.ఇంట్లోఉండే ప్రతీదీ మనకు పరిచయమే,మనవద్ద ఉన్నవి మనకు తెలుసు.మనసు లోతుల్లోకి కూడా “మన జ్ఞాపకాలు” తీసికెళ్తాయి- మన పుట్టుక,ఉనికి, సార్ధకతకి ప్రయత్నం చేస్తాం!
కానీ ఈప్రపంచం,దాని పుట్టుక, ఉనికికి పూర్వం ఎలాఉండేది? ఇలాంటి ప్రశ్నలు మనకు తట్టినప్పుడే మనం అంతర్ముఖంగా అన్వేషణచేయాలి అనే తలంపు కలుగుతుంది!
ఈ ఆతృత,జిజ్ఞాస ప్రేరణలుగా అయిన తక్షణం మనం అంతర్ముఖంగా ప్రయాణం ఆరంభించటానికి అంకురార్పణ జరుగుతుంది.ఈ ఆలోచనతో తొలి అడుగు వేసిన క్షణంనుండి,అదే అడుగు మరిన్ని అడుగులు ఆదిశలో పడేలా చేస్తుంది. ఈ మానవశరీరం దొరకటం దుర్లభం ప్రతిజీవికి!
మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు గుర్తుతెచ్చుకుందాం, మనధ్యాస భగవధ్యానంమీద ఉంటుంది.బయట చెప్పులు కొట్టేవాడు వాడిపనిలో ఉంటాడు, వాడిపని వాడిదే “వాడిగా”- మనధ్యాస మనదిగా ఉండాలి అంతేగానీ,చిత్తం శివుని మీదా,ధ్యాస చెప్పులమీద ఉండకూడదు!
శరీరం బాహ్యసుఖాల్ని,అందాన్ని కోరుకుంటుంది-ధర్మాతిక్రమణ లేకుండా శరీరధర్మాన్నిపాటిస్తూ బాహ్య ప్రపంచంలో విహరించనీయండి.అలాగే ఆత్మని మిమ్మల్ని అంతః ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళనివ్వండి;అప్పుడే తెలుస్తుంది- శరీరం అశాశ్వతమైనది అని,ఆత్మయే శాశ్వతత్వంతోవుంటుందని, మనం ఆత్మతప్ప,శరీరం కాదనీను!!
అప్పుడే ఈ మానవ జన్మకి సార్ధకత!
వినాయకుడు-విఘ్నాలు!!!
వినాయకుడు విఘ్నాధిపతి,మనం ఏదైనా ముఖ్యమైనపని చేసేముందు, ప్రతిపూజా చేసేముందు ఆయన్నే ప్రార్ధిస్తాం,ఆవాహన చేస్తాం.తలబెట్టబోయే పని నిర్విఘ్నంగా జరగాలని, ఏ అడ్డు-ఆటంకాలు ఎదురవకూడదు అని,కానీ కొన్నిసార్లు ఆయనే అడ్డంకులు కలిగిస్తాడు-అనుకోని విఘ్నాలతో!
ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ!!
వివరిస్తాను!!!
కొన్నిసార్లు చాలామంది జీవితాల్లో ఈ సంఘటనలు జరిగి ఉంటాయి,ఎంతో ముఖ్యం అనుకున్నపనికి ఆటంకాలు ఎదురై మనం అనుకున్నపనిఅవదు,లేదాముందుకు జరగదు.ఆసమయాల్లోమనం బాధకు గురిఅయికూడా ఉంటాం.కానీ ఆ ఆటంకమే మనల్నిఇబ్బందులకు గురికాకుండా ఇంకో మంచి చేస్తుంది- జ్ఞప్తికి తెచ్చుకుంటే బోలెడు.అప్పుడు మనంఅనుకొని ఉంటాం "మనం అనుకున్నట్టు ఆరోజు జరిగి ఉంటే ఎంత ఇబ్బందుల్లో పడేవాళ్ళమో అని"
ఇంతకీ నే చెప్పేదేమిటంటే ఎప్పుడైనా ముఖ్య మైన పనులకి విఘ్నాలువస్తే అది విఘ్నాదిపతి కల్పించిందే అనుకొని కాస్తవేచి చూడండి-ఎందుకంటే విఘ్నాలకు అడ్డంకులు వేసేది ఆయనే,కల్పించేది ఆయనే!
ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే జీవితంలో అంతా ప్రశాంతతే మరి!!!
అడ్డంకులు లేకుండా ప్రార్ధించడం వరకు మనవంతు,మిగతా విషయాలు ఆయనకే వదిలి నిశ్చింతగా ఉండండి,ఆయనే చూసుకుంటాడు అన్నీనూ!!!
పుట్టుక, జీవన ప్రయాణం, నిష్క్రమణ!!!
నదినుండి పుట్టిన నీరు ప్రయాణం చేస్తూ సముద్రాన్ని చేరుతుంది చివరి మజిలీలో; ఆ సముద్రంలో చేరిన నీరు మరలా అవిరిగామారి ఆకాశంలోకి ఎగసి మేఘంగా మారుతుంది!అదే నీరు మళ్ళా వర్షపు నీరుగా మారి కొంత పుడమిలోను, కొంత నదుల్లో చేరుతుంది; మళ్లీ చివరకు సంద్రంలోనే కలిసి పోతుంది-ఇది నిరంతర ప్రక్రియ!!!
నీరు- పుట్టుక నుండి, చివరి మజిలీ వరకూ చాలా సహజమైన సంతోషంతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.చివరకు సంద్రం ఒడిలో చేరేసమయంలో కూడా ఆనందంగా ఉరకలు వేస్తుంది-తల్లి ఒడికి చేరే పిల్లలలాగా!
మనిషి జీవితం కూడా అంతే -పుట్టుక, పెరుగుట,అంతర్ధానం ఆవుట; తిరిగి మరోరూపులో-మరో పాత్రతో ధరణి మీద ప్రత్యక్షమవుతాం.
ఎక్కడా విషాద ఛాయలు లేకుండా- తామరాకు మీద నీటి బొట్టులా, జీవితాన్ని ఆనందంగా సాగించే వాడే విజ్ఞుడు!!
ఆ భగవంతుడు ఆ విజ్ఞతని అందరికీ ఇవ్వాలని- మన ప్రయాణం ఆగే లొపున- ప్రార్ధిస్తూ...
అమృత వాక్యాలు!!!
మనుషులను సాధారణంగా క్రింది విధంగా వర్గీకరణ చెయ్యొచ్చు!!!
1.అంతర్ముఖుడు
2.బహిర్ముఖుడు
3.తటస్థుడు
4.స్థిత ప్రజ్ఞుడు
ప్రస్తుత లోకంలో నాల్గవ వర్గానికి చెందిన వారు బహు తక్కువగా కనపడతారు!!!
గీతలో శ్రీకృష్ణభగవానుడు అర్జుననకు ఉపదేశించింది ఇదే- అసాధ్యమైనస్థితి కాదుకాని,బహు కష్టతరమైన సాధనతోనే ఈస్థితి సిద్ధిస్తుంది; కానీ ఈస్థితి పొందడానికి ప్రతీజీవికి భగవంతుడు అర్హత ఇచ్చాడు, అది సిద్దించుకోటానికి బహు సాధనాలు, ఉపకారణాలను అందుబాటులోఉంచాడు కూడా-ప్రయత్న లోపం మనదే!
ఆ మార్గానికి వెళ్లేందుకు కృషి ఎందుకు చేయ కూడదు- ప్రతి ఒక్కరూ!!!
ఎంత వింత- ఏమి లీల!!
మనం దేవుని సృష్టించిన బొమ్మలం! తను చెక్కిన శిల్పాలకి,చక్కటి కదిలే శిల్పంలా ప్రాణప్రతిష్ట చేసి మనల్ని ఈ గ్రహానికి పంపాడు.
ఈ కదిలే బొమ్మలైన మనకి-శిలలకి ప్రాణప్రతిష్టచేసే శక్తి,సాధనాలు ఇచ్చాడు.తనకే ప్రాణం ఇచ్చిన దేవునికి, ప్రాణప్రతిష్ట చేసే శక్తిని ఇచ్చాడు మానవులకు! మనం ఎంత అదృష్ట వంతులం!
మానవ జన్మ దొరకటం- కాదు పొందడం-మన పూర్వ జన్మ పుణ్యఫలం!
సద్వినియోగ పరుద్దాం జీవితాన్ని!!!